వావ్‌.. ఈ అమ్మాయి ఎంత అద్భుతంగా డ్యాన్స్ చేసిందో

డ్యాన్స్. ఈ పేరు వింటే చాలు ఓ చెప్ప‌లేనంత ఆనందం ప్ర‌తి ఒక్క‌రికీ వ‌చ్చి తీరుతుంది.ఎందుకంటే డ్యాన్స్ అంటేనే అదో ఉత్సాహం.చెప్ప‌లేని ఆనందంతో చేసే మైమ‌రుపు.కానీ అందంగా డ్యాన్స్ చేయాలంటే అంద‌రికీ సాధ్యం కాదు.కేవ‌లం కొంద‌రికి మాత్ర‌మే సాధ్యం అవుతుంది.

 School Girl Dances Wonderfully For Nach Meri Rani Song Details, , Girl Dance, Vi-TeluguStop.com

ఇలాంటి అంద‌మైన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు నిత్యం హ‌ల్ చ‌ల్ చేస్తూనే ఉంటాయి.ఇలాంటి వాటికి వేల‌ల్లో కామెంట్లు వ‌స్తుంటాయి.

ఇప్పుడు కూడా ఇలాంటి ఆనంద‌ప‌రిచే వీడియో ఒక‌టి నెట్టింట్లో తెగ హ‌ల్ చ‌ల్ చేస్తోంది.

మొన్న‌టికి మొన్న ఓ బామ్మ అంటే దాదాపు 70 ఏండ్లు దాటిన వ‌య‌సులో కూడా అద్భుతంగా డ్యాన్స్ చేసిన వీడియో బాగా ఆక‌ట్టుకుంది.

అంటే డ్యాన్స్‌కు వ‌య‌సుతో సంబంధం లేద‌ని మ‌రోసారి నిరూపితం అయిపోయింద‌న్న మాట‌.ఇప్పుడు కూడా ఓ స్కూల్ గ‌ర్ల్ కూడా ఇలాగే డ్యాన్స్‌కు త‌న చిన్న వ‌య‌సు అడ్డు రాద‌ని, ఎంతో అందంగా డ్యాన్స్ చేసి నిరూపించింది.

ఆమె డ్యాన్స్ చూసిన వారంతా కూడా వావ్ అంటున్నారంతే.ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతోంది.

అయితే ఇందులో ఆమె స్కూల్ యూనిఫామ్ వేసుకుంది.

ఆమె బాలీవుడ్ న‌టుడు గురు రంధవా అలాగే డ్యాన్స్ కా స్టార్ అయిన నోరా ఫతేహి నటించి మెప్పించిన‌ నాచ్ మేరీ రాణి సాంగ్‌కు అద్భుతంగా డ్యాన్స్ చేసింది.అది కూడా ఆమె ఏదో రోడ్ మీద‌నే డ్యాన్స్ చేస్తోంది.ఆమె చుట్టూ వేరే వాల్లు ఉన్నా కూడా అవేవీ ప‌ట్టించుకోకుండా డ్యాన్స్ తో మైమ‌రిపించేలా చేసింది.

ఇప్పుడు ఆమె ఒక్క‌సారిగా ఈ పాట‌తో స్టార్ అయిపోయింద‌నే చెప్పాలి.ఆమె డ్యాన్స్ చూసిన వారంతా కూడా ఫిదా అయిపోతున్నారు.ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్ల‌తో ఆమెకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు.మ‌రి లేటెందుకు మీరు కూడా చూసేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube