పుష్ప ఐటమ్ సాంగ్ కోసం సామ్ ఎంత కష్టపడిందో చూశారా?

టాలీవుడ్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా నటించిన తాజా చిత్రం పుష్ప.ఈ సినిమా గత నెల డిసెంబర్ 17న పాన్ ఇండియా లెవెల్ లో థియేటర్ లలో గ్రాండ్ గా విడుదలైన విషయం అందరికి తెలిసిందే.

 Pushpa Oo Antava Oo Oo Antava Song Behind The Scenes Pushpa, Allu Arjun, Samanth-TeluguStop.com

ఈ సినిమా విడుదల అయి సూపర్ హిట్ టాక్ ను అందుకుంది.అంతే కాకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పుష్ప రాజ్ పాత్రలో నటించగా, రష్మిక మందన శ్రీవల్లి పాత్రలో నటించింది.సినిమాలో వీరి నటనకుగాను పలువురు ప్రముఖులు వారిపై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ సినిమాకు సుకుమార్ దర్శకత్వం వహించిన విషయం అందరికి తెలిసిందే.ఈ సినిమా విడుదలైన తర్వాత మొదట నెగిటివ్ టాక్ వినిపించినప్పటికీ, ఆ తర్వాత పాజిటివ్ టాక్ తో దూసుకుపోయింది.

ఇందులో స్టార్ హీరోయిన్ సమంత స్పెషల్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన విషయం తెలిసిందే.ఈ పాట విడుదల అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ చూసినా కూడా ఈ పాట మార్మోగిపోతోంది.

ఇక ఈ పాటను రీ క్రియేట్ చేసి సోషల్ మీడియాలో ఇప్పటికే పలు వీడియోలను కూడా రిలీజ్ చేశారు.అయితే ఈ పాట రిలీజ్ అయిన తర్వాత ఇందులో మగవాళ్ళను అగౌరవపరిచే విధంగా పదాలు ఉన్నాయి అంటూ ఏపీ పురుషుల సంఘం కోర్టులో కేసు వేసిన విషయం కూడా తెలిసిందే.

అంతే కాకుండా సమంతా పై కూడా పలు కేసులు పెట్టారు.అయినా కూడా ఈ పాట ఎక్కడ తగ్గకుండా అదేరీతిలో కొనసాగుతూ ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాకుండా యూట్యూబ్ లో కోట్లలో వ్యూస్, అలాగే లక్షల్లో లైక్స్ వచ్చాయి.

ఇప్పటికి ఈ పాట ట్రెండింగ్ లో ఉంది.

అయితే ఈ పాట కోసం సమంత ఎంతలా కష్టపడిందో తాజాగా అందుకు సంబంధించిన ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియోలో స్టెప్స్ మాత్రమే కాకుండా.సమంత కనిపించిన విధానం కూడా నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తుంది.

అరకొర దుస్తుల్లో సమంత హాట్‌హాట్‌గా కనిపించింది.ఈ వీడియోని స్వయంగా సమంతే తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్‌లో విడుదల చేయడం గమనార్హం.

ఈ వీడియోపై నెటిజన్లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.పుష్ప కాదు సమంత ఫైర్, అరుపులే అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube