హైదరాబాద్ కె.పి.
హెచ్.బి లోని శివ పార్వతి థియేటర్ లో మిడ్ నైట్ ఫైర్ యాక్సిడెంట్ తో థియేటర్ మొత్తం కాలిపోయిన ఘటన తెలిసిందే.
అయితే షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది.దాదాపు రెండు గంటల పాటుగా థియేటర్ లో మంటలు వచ్చాయట.థియేటర్ లో సీట్లు మొత్తం కాలిపోయాయి.థియేటర్ పై కప్పు కూడా పూర్తిగా ఆ మంటకి బూడిదైంది.
ఈ ఘటనపై తన విచారాన్ని వ్యక్తం చేశారు నాచురల్ స్టార్ నాని.శివ పార్వతి థియేటర్ ఫైర్ యాక్సిడెంట్ వార్త తనని బాధ పెట్టిందని అన్నారు.
అంతేకాదు ఆ థియేటర్ లో మహేష్ బాబు నటించిన టక్కరి దొంగ సినిమా ఫస్ట్ టైం ఆనందంతో చూశామని.అయితే ఈ ఫైర్ యాక్సిడెంట్ లో ఎవరికి ఏమి అవకపోవడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
కె.పి.హెచ్.బి లో విశ్వనాథ్, అర్జున్, శివ పార్వతి మూడు థియేటర్లు ఒకే చోట ఉంటాయి.
శివ పార్వతి, అర్జున్ పక్క పక్కనే ఉంటాయి.అయితే థియేటర్ లో షాట్ సర్ క్యూట్ వల్ల థియేటర్ మొత్తం ధ్వంసం అయ్యింది.
ఆ థియేటర్ లో ప్రస్తుతం నాని శ్యాం సింగ రాయ్ సినిమా ఆడుతుంది.