ఆర్ఆర్ఆర్ వల్ల రూ.200 కోట్లు నష్టపోయిన ఎన్టీఆర్.. అసలేం జరిగిందంటే?

దర్శకధీరుడు రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించడానికి కనీసం మూడేళ్ల సమయం తీసుకుంటున్నారనే సంగతి తెలిసిందే.ఆర్ఆర్ఆర్ సినిమా కూడా మూడేళ్లలో షూటింగ్ పూర్తి చేసుకున్నా కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ మరింత ఆలస్యమైంది.

 Ntr Lost 200 Crore Rupees Because Of Rrr Movie , Interesting Facts , Junior Ntr,-TeluguStop.com

అయితే ఈ సినిమా వల్ల ఎన్టీఆర్ ఏకంగా 200 కోట్ల రూపాయల వరకు నష్టపోయడని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

ఆర్ఆర్ఆర్ వల్ల ఎన్టీఆర్ కెరీర్ లో మూడున్నరేళ్ల సమయం వృథా అయింది.

ఈ సమయంలో ఎన్టీఆర్ కనీసం మూడు నుంచి నాలుగు సినిమాలు రిలీజ్ చేసేవారు.హీరోగా కెరీర్ ను మొదలు పెట్టిన తర్వాత 2009 మినహా మిగిలిన అన్ని సంవత్సరాల్లో 2018 వరకు తారక్ సినిమాలు రిలీజయ్యాయి.

ఆర్ఆర్ఆర్ కు ఎన్టీఆర్ పరిమితం కావడంతో 2019 సంవత్సరంలో, 2020 సంవత్సరంలో, 2021 సంవత్సరంలో తారక్ నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ తో జనవరి తొలివారంలోనే తారక్ సందడి చేస్తాడని భావిస్తే ఆర్ఆర్ఆర్ మళ్లీ వాయిదా పడింది.

ఈ సినిమా ఏప్రిల్ లేదా జులైలో రిలీజ్ కావచ్చని వార్తలు వస్తున్నాయి.ఆర్ఆర్ఆర్ మూవీ పదేపదే వాయిదా పడటంతో నిర్మాతల లాభాలకు సైతం ఊహించని స్థాయిలో గండి పడుతోందని సమాచారం.

ఎన్టీఆర్ తర్వాత సినిమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎన్టీఆర్ కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాను వెంటనే మొదలుపెట్టాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.ఆర్ఆర్ఆర్ మూవీకి దిష్టి తగిలిందని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.ఎన్టీఆర్ ఇకనైనా సినిమాల విషయంలో వేగం పెంచాలని ఏడాదికి ఒకటి లేదా రెండు సినిమాలు కచ్చితంగా విడుదలయ్యేలా కెరీర్ ను ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

సినిమాసినిమాకు ఎన్టీఆర్ కు క్రేజ్ పెరుగుతుండగా ఎన్టీఆర్ కొరటాల కాంబో మూవీ ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది.

NTR Loss Rs.200 Crore Because of RRR Movie #NTR

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube