మనం పూజ చేసినప్పుడు లేదా గుడికి వెళ్లినప్పుడు ముందుగా చేసే పని గంట కొట్టడమే.అసలు గంట ఎందుకు కొట్టాలి.
గంట కొట్టడం వల్ల ఏం జరుగుతుందో తెలుసుకుందాం.భగవంతుడి దర్శనం అంటే మనలోని అసుర గుణాలను పారద్రోలి, దైవీగుణాలను ఆహ్వానించడమే.
అందుకు సంకేతంగా రాక్షసులను తరిమి వేయడానికి, దేవతలను పిలిచేందుకు గంట కొడుతుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు .అందుకే గుడిలోకి వెళ్లగానే గంట కొట్టి స్వామి వారిని ఆహ్వానించి… ఆ తర్వాతే దైవ దర్శనం చేసుకుంటారని ప్రతీతి.హారతి సమయంలో కూడా అందుకే గంటానాదం చేస్తారంటారు.ఆ సమయంలో స్వామి దర్శనం దివ్య దర్శనమవుతుందట.ఆ హారతి దివ్య జ్యోతిగా ప్రజ్వలిస్తుందంట.మనం గంట కొట్టినప్పుడు వచ్చే నాదం దివ్య నాదంగా మారుతుందట.
ఆ హారతి వెలుగులలో స్వామిని విగ్రహ రూపంలో దర్శిస్తూ.తనలోకి తాను చూసుకుంటూ భక్తులు అంతర్ముఖులు కావాలన్నది మన సంప్రదాయంలోని ఆంతర్యమని పెద్దలు చెబుతుంటారు.
అలాగే చాలా మంది భక్తులు కోరిన కోరిక తీరిస్తే… గంటలు గుడిలో కడతామని మొక్కుకుంటూ ఉంటారు.అలాగే చిన్న పిల్లలకు మాటలు రాకపోయినా.
గుడుల్లో గంటలు కట్టి తమ పిల్లలకు మాటలు రావాలని కోరుకుంటారు.మన హిందూ సంప్రదాయంలో ఏ పని చేసిన దాని వెనుక ఓ కారణం ఉంటుంది.
దేవతలను రమ్మని మేల్కొల్పేందుకు ఆలయాల్లో ఈ గంటలు ఉంటాయి.గుడికి వెళ్లిన ప్రతీ ఒక్క భక్తుడు గంట కొట్టి ఆ దేవుడిని పిలుస్తాడు.
ఆ తర్వాతే దర్శనం చేసుకుంటాడు.