RRR సినిమా వాయిదా వల్ల ఎన్ని కోట్లు నష్టం తెలుసా ?

సినీ ప్రేక్షకులు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ఆర్ఆర్ఆర్ సినిమా మరోసారి వాయిదా పడింది.కనీసం ఈసారైనా ఈ సినిమా విడుదల అవుతుంది అని అనుకున్నప్పటికీ చివరికి ఊహించని విధంగా చిత్రబృందం ట్విస్ట్ ఇచ్చింది.

 Huge Loss Due To Postponement Of Rrr-TeluguStop.com

ఈ సినిమాను వాయిదా వేస్తున్నాము అంటూ ప్రకటించింది.దీనికి కారణం ప్రస్తుతం కొన్ని రాష్ట్రాలలో కేవలం 50 శాతం ఆక్యుపెన్సీ తో థియేటర్లు నడుస్తూ ఉండటం.

ఇలాంటి నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు భారీగా డిస్కౌంట్ అడుగుతున్న నేపథ్యంలోనే నష్టాలు వచ్చే అవకాశం ఉందని సినిమా వాయిదా వేశారట.కానీ ప్రస్తుతం వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా వాయిదా వేసినందుకు కూడా కొంత నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.

అదేంటి సినిమా విడుదలైన తర్వాత కూడా లాభమా నష్టమా అని తెలిసేది విడుదల అవ్వక ముందే నష్టం ఎలా వచ్చింది అని అనుకుంటున్నారు కదా.ఆర్ఆర్ఆర్ సినిమా కోసం నిర్వహించిన ప్రమోషన్స్ ఖర్చు మొత్తం ప్రస్తుతం నిర్మాతలకు నష్టం గానే మిగిలిపోయింది అన్నది తెలుస్తుంది.ఎందుకంటే ఇప్పటి వరకు ఏ సినిమాకు చేయని రేంజిలో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు.సినిమాలో హీరోగా నటించిన ఎన్టీఆర్ చరణ్ తో పాటు బాలీవుడ్ లో  కూడా కలిసి రావడానికి ఆలియాభట్, అజయ్ దేవగన్ తో కూడా ప్రమోషన్స్ చేశారు.

అయితే ఈ ప్రమోషన్ కు కూడా అలియా భట్, అజయ్ దేవగన్ కు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

అలియా భట్ కి ప్రమోషన్ కోసం రోజుకు 20 లక్షలు, అజయ్ దేవగన్ కి రోజుకు 40 లక్షల వరకు రెమ్యూనరేషన్ ముట్ట చెప్పారట నిర్మాతలు.

అదే సమయంలో ఇక అటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను ప్రతి నగరానికి తిప్పడానికి ప్రత్యేకమైన ఫ్లైట్ ఛార్జీలు కూడా అదనం అనే చెప్పాలి.అంతేకాదండోయ్ ఇక ఎలాగూ విడుదల చేస్తానని చెప్పి ముంబై లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారు అన్నది అందరూ చూసిందే.ఇలా ఓ వైపు ప్రమోషన్స్ మరోవైపు ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఖర్చులు కూడా ఇప్పుడు నిర్మాతలకు నష్టాలు గానే మిగిలిపోయాయి అని అంటున్నారు విశ్లేషకులు.ఇక మరోవైపు ఆర్ఆర్ఆర్ ను వాయిదా వేస్తూ రాజమౌళి తీసుకున్న నిర్ణయం కారణంగా అటు ఇద్దరు హీరోల అభిమానులకు కూడా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది.

ఎలా అంటే.జనవరి 7వ తేదీన ఈసారి పక్కా సినిమా విడుదలవుతుందని భావించి థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు అభిమానులు ఇద్దరు హీరోల అభిమానులు పోటీ పడి మరీ భారీ కటౌట్లు బ్యానర్లు ఏర్పాటు చేసి భారీగానే ఖర్చు పెట్టారు.అది కూడా ప్రస్తుతం వృధాగా అయిపోయింది అని చెప్పాలి.కాగా ఇప్పుడు వాయిదా ఆర్ఆర్ఆర్ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అన్న దానిపై మాత్రం క్లారిటీ లేదు.

ఒకవేళ కరోనా వైరస్ ప్రభావం పెరిగితే ఆరు నెలలు పట్టొచ్చు లేదా ఏడాది సమయం కూడా పట్టొచ్చు.

Huge Loss to RRR Makers Due to Postpone RRR #RRR

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube