సిలిండర్ కు కూడా ఎక్సపయిరీ డేట్ ఉంటుందని మీకు తెలుసా..ఎలా గుర్తించాలంటే..

మనకు ఇప్పుడు వంట చేసుకోవడానికి సిలిండర్ తప్పని సరి అయ్యింది.ఇది వరకు రోజుల్లో అంటే కట్టెల పొయ్యిని వాడే వారు.

 Lpg Gas Cylinder Code Means What Is Meaning Of The Number Written On The Gas Cyl-TeluguStop.com

ఇప్పుడు పల్లెటూరులో కూడా చూద్దామన్నా ఎవ్వరు కట్టెల పొయ్యి మీద వంట చెయ్యడం లేదు.ఎప్పుడో ఒకసారి పిండి వంటల సమయంలో కట్టెల పొయ్యిని ఉపయోగిస్తున్నారు.

కొంతమంది అయితే పిండి వంటలు సైతం గ్యాస్ మీదనే వండుతున్నారు.

అయితే మనం అందరం గ్యాస్ సిలిండర్ వాడుతూనే ఉన్నాం.

కానీ గ్యాస్ సిలిండర్ విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే మనం క్షేమంగా ఉంటాం.అలా కాదు అని పట్టించుకోక పోతే నష్టం తప్పదు.

చాలా మందికి అసలు వంట గ్యాస్ సిలిండర్ నిర్వహణ, సిలిండర్ సంబంధించిన కొన్ని విషయాలు అసలే తెలియవు.కొంత మందికి మాత్రమే ఈ విషయాల గురించి అవగాహనా ఉంటుంది.

ముఖ్యంగా వంట గ్యాస్ సిలిండర్ మీద ఎక్సపయిరీ డేట్ ఉంటుంది అని మనలో చాలా మందికి తెలియదు.ఈ గడువు దాటిన తర్వాత మీ ఇంటికి వచ్చే సిలిండర్ లలో లీకేజీలు ఏర్పడవచ్చు.

ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువుగా ఉంటాయి.వంట గ్యాస్ సిలిండర్ మీద ఎక్సపయిరీ డేట్ విషయం పౌర శాఖ అధికారుల్లో కూడా చాలా మందికి తెలియదు.

ప్రతి సిలిండర్ పై భాగంలో గుండ్రటి గ్యాండిల్ ఉంటుంది.దానికి సిలిండర్ సపోర్టడ్ గా మూడు ప్లేట్స్ ఉంటాయి.ఈ ప్లేట్లపై లోపలి వైపు అంకెలు వేసి ఉండడాన్ని గమనించ వచ్చు.ఈ మూడింటిలో ఒక దానిపై ఎక్సపయిరీ డేట్ ఉంటుంది.సంవత్సరం, నెల వివరాలు దీనిపై ఉంటాయి.

వంట గ్యాస్ సిలిండర్ మీద ఎక్సపయిరీ డేట్ ఎలా తెలుసుకోవాలి అంటే ఉదాహరణకు A22 అని ఉంటే.జనవరి నుండి మర్చి, 2022 వరకు అని అర్ధం.సిలిండర్ ఆ సంవత్సరం మొదటి త్రైమాసికం చివరితో గడువు తీరిపోతుందని అర్ధం.

B అంటే ఏప్రిల్ నుండి జూన్ అని, C అంటే జులై నుండి సెప్టెంబర్ అని, D అంటే అక్టోబర్ నుండి డిసెంబర్ వరకు అని అర్ధం.డేట్ అయిపోయిన గ్యాస్ సిలిండర్ ను తీసుకోకూడదు.

How to Check Expiry Date of LPG Gas Cylinder LPG

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube