అయ్యో రామా... సమంతకు సలహా ఇచ్చిన చిరంజీవి.. అతను చెప్పడం వల్లే ఆమె ఆ నిర్ణయం?

సమంత నాగచైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంది.అంతేకాకుండా సమంత పేరు టాప్ ట్రెండింగ్ లో ఉంది.

 Chiranjeevi Reason Behind Samantha Item Song In Pushpa Movie, Pushpa Movie, Naga-TeluguStop.com

సమంత తో విడాకులు తీసుకొని రెండు నెలలు కావస్తున్నా కూడా ఆమెకు సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది.విడాకుల తర్వాత సమంతా సోషల్ మీడియా లో ఎటువంటి పోస్ట్ పెట్టినా కూడా క్షణాలలో వైరల్ అవడమే కాకుండా, నెటిజన్లు ఆ పోస్ట్ పై తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా సమంత తీసుకున్న ఒక నిర్ణయం వెనుక మెగాస్టార్ చిరంజీవి హస్తం ఉంది అనే వార్తలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి.

ఇటీవలే అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా విడుదల అయ్యి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ ను అందుకుని కలెక్షన్ల వర్షం కురిపించిన విషయం తెలిసిందే.

ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది దూసుకుపోతోంది.ఇక ఈ సినిమాలో నటీనటుల నటన ఒక ఎత్తు అయితే, సమంత చేసిన ఐటమ్ సాంగ్ మరొక ఎత్తు అని చెప్పవచ్చు.

ఈ సినిమాలో సమంత సాంగ్ కోసమే సినిమాకు వెళ్లిన వారు ఎంతో మంది వున్నారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.సమంత కూడా తన కెరీర్ లో మొదటి సారిగా ఐటమ్ సాంగ్ ను చేసింది.

అయితే సమంత ఐటమ్ సాంగ్ చేయడం వెనుక మెగాస్టార్ ఇన్వాల్వ్ కూడా ఉందని తెలుస్తోంది.

చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత చిరంజీవి రామ్ చరణ్ హాజరైన ఒక ప్రైవేటు ఈవెంట్ కి సమంతా కూడా హాజరు అయిందట.ఆ క్రమంలో చైతన్యతో విడాకుల కారణంగా డిప్రెషన్ ఫీల్ అవుతోంది అని కొంతమంది సన్నిహితుల ద్వారా తెలుసుకున్న చిరంజీవి.సినిమాలలో నటిస్తూ బిజీ బిజీ కావడం ద్వారా ఆ డిప్రెషన్ నుంచి బయటపడవచ్చు అని సలహా ఇచ్చారట.

అంతేకాకుండా పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ గురించి చెప్పి నచ్చితే సాంగ్ చేయమని సలహా కూడా ఇచ్చారట.దీంతో సమంతా కూడా చిరు మాటను గౌరవించి ఐటమ్ సాంగ్ చేసేందుకు రెడీ అయిందట.

Chiranjeevi Behind Samantha Special Song in Pushpa

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube