గాలోడు టీజర్ రిలీజ్.. సుడిగాలి సుధీర్ మేకోవర్ మాములుగా లేదుగా?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అదే పాపులారిటీతో పలు సినిమాలలో నటించారు.అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ సారి మాస్ యాక్షన్ తరహాలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

 Sudigali Sudheer Galodu Movie Teaser Details, Sudigalli Sudheer, Galodu Teaser,-TeluguStop.com

ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ దర్శకత్వంలో గాలోడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సుధీర్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు .ఇందులో సుధీర్ మేకోవర్ డిఫరెంట్ గా ఉండడమే కాకుండా నాకు ఎవరిపై నమ్మకం లేదు నన్ను నేను నమ్ముకుంటా అని సుధీర్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ సినిమాలో సుధీర్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.ఇకపోతే ఈ టీజర్ లో సప్తగిరి, పృథ్వీ కనిపించారు.

శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించారు.ప్రస్తుతం సుధీర్ గాలోడు టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube