నెల్లూరు ఫార్ములాను కుప్పంలో అమ‌లు చేయ‌డం బాబుకు క‌ష్ట‌మేనా..?

మున్సిపల్ ఎన్నికల్లో ఘోర ఓటమితో చంద్రబాబు పార్టీ ప్రక్షాళణపై దృష్టిసారించారు.ఇందులో భాగంగా నెల్లూరు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ ఓటమికి బాధ్యులను చేస్తూ.

 Is It Difficult For Babu To Implement Nellore Formula In A Kuppam Chandrababu, T-TeluguStop.com

ఇద్దరిపై వేటు వేశారు.ఇంత వరకు బాగానే ఉన్నా.

మరీ కుప్పం సంగతి తేల్చుతారా? లేదా అని బాబు వైపు క్యాడర్ ఆశగా ఎదురుచూస్తున్నారంటా.అయితే బాబు మాత్రం కుప్పం స్థానిక నేతలను సస్పెండ్ చేయడానికి వెనుకడుగు వేస్తున్నారనే టాక్ జిల్లాలో వినిపిస్తుంది.

కుప్పం చంద్రబాబు నాయుడికి కంచుకోట.ఏడు సార్లు ఆయన ఇక్కడి నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు.

సొంత కుటుంబ సభ్యులను పక్కనబెట్టి మునిరత్నం, మనోహర్ నాయుడులకే పార్టీ బాధ్యతలను అప్పజెప్పారు చంద్రబాబు.అయితే 2019 ఎన్నికల నుంచి టీడీపీ పరిస్థితి తలకిందులైంది.

గతంతో పోల్చుకుంటే చంద్రబాబు మెజార్టీ తగ్గిపోయింది.ఇక అటు నుంచి జరిగిన పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో టీడీపీ తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది.

ఇక్కడ ప్రధానంగా ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాల్సి ఉంటుంది.అతనే మంత్రి పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి.

బాబు కంచుకోట కుప్పంను బద్దలు కొట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డికి బాధ్యతలు అప్పజెప్పారు సీఎం జగన్.దీంతో పెద్దిరెడ్డి తనదైన వ్యూహాలను అమలు చేస్తూ కుప్పంలో జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీడీపీని చిత్తు చిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు.

Telugu Chandrababu, Kuppam, Lokesh, Nelluru, Peddiredddy, Ys Jagan, Ysrcp-Telugu

తాజాగా జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ టీడీపీ తలరాత మారలేదు.పెదబాబు, చినబాబు కాలికి బలం కట్టుకుని కుప్పంలో ప్రచారం చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండాపోయింది.దీంతో స్థానిక టీడీపీ నాయకులపై చర్యలు తీసుకుంటారనే అంతా అనుకున్నారు.ఇప్పటికే కుప్పం మున్సిపల్ ఎన్నికల ఓటమిపై బాబుకు పూర్తిస్థాయి నివేదక అందింది.మునిరత్నం, మనోహర్ వైఖరి కారణంగానే పార్టీ ఓడిపోయిందని కిందిస్థాయి క్యాడర్ చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు.అయితే వారిపై చర్యలు తీసుకోవడానికి బాబు వెనకడుగు వేస్తున్నారని సమాచారం.

కొన్ని దశాబ్దాలపాటు చంద్రబాబు వారిపై ఆధార పడడం, పార్టీ లొసుగులు వాళ్లకు తెలిసి ఉంటాయి కనుక నెల్లూరు మాదిరి ఇక్కడ చర్యలు తీసుకునేందుకు బాబు జంకుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube