నీళ్లలో ఎంజాయ్ చేస్తున్న అమ్మాయి.. స‌డెన్‌గా ఏమైందంటే..?

వర్షంలో తడవడం అంటే కొందరికి మహా సరదా.మరికొందరైతే తడిసి ముద్దై తెగ ఎంజాయి చేస్తారు.

 Girl Enjoying The Water Suddenly What Details, Amazing Girl, Viral Video, Leg Sl-TeluguStop.com

చినుకులు పడుతున్నప్పుడు ఆకాశం వైపు చూస్తుండగా.ముఖంపై సన్నటి వాన బిందులు పడుతుంటే తన్మయత్వంతో ఎగిరి గంతెస్తారు.

మరికొందరైతే వర్షపు నీటిలో స్నానం చేసి అందులోనే ఆటలు ఆడుకుంటుంటారు.ఇలాంటి కోవకు చెందిన కొన్ని ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో ఇటీవల తరచూ వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఇలానే ఓ అమ్మాయి వాన చినుకుల సవ్వడిలో గంతులేస్తూ తెగ ఎంజాయ్ చేసింది.ఇంతలో అనుకోని ఘటన చోటుచేసుకోవడంతో కిందపడిపోయింది.

ఈ వీడియోను మీరు చూస్తే బాగా నవ్వుకుంటారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతోంది.

ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియదు కానీ, ఓ అమ్మాయి పార్క్‌లో సరదాగా గడుపుతోంది.అప్పటికే భారీగా కురిసిన వర్షంతో పార్క్ మొత్తం నీటితో నిండిపోయింది.

వాన నీటిలో కేరింతలు కొడుతూ ఎగిరి గంతేసింది సదరు అమ్మాయి.అయితే ఇంతలో ఎగిరినట్టే ఎగిరి నిల్చొన్న చోటు నుంచి అవతలి వైపు వెళ్లేందుకు కాలు పెడుతుంది యువతి.దీంతో వెంటనే ఠక్కున జారీ నీటిలో పడిపోతుంది.6 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండీగా మారింది.ఇప్పటి వరకు ఈ వీడియో 74 వేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.వీడియోను చూసిన నెటిజన్లు లైకులు, కామెంట్లతో హోరెత్తిస్తున్నారు.ఒకరు ‘అయ్యో.అయ్యో.అయ్యయో.

పాపం.!’ అంటూ కామెంట్ చేయగా.

‘ఇలాంటివి కూడా స్వీట్ మెమరీస్’ అంటూ మరొకరు కామెంట్ చేశారు.మీరు ఈ వీడియో చూడనట్లయితే.

చూసేసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇందుకు సంబంధించిన న్యూస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రెండ్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube