బిగ్ బాస్ తెలుగు ఓటీటీకి టైమ్ ఫిక్స్.. ఆ ముగ్గురు ఫిక్స్?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 షో ఇటీవలే కొద్ది రోజుల క్రితం ముగిసిన విషయం అందరికీ తెలిసిందే.అయితే ఒకసారి బిగ్ బాస్ సీజన్ ముగిసిన తర్వాత మరొక సీజన్ కోసం చాలా రోజుల పాటు వేచి చూడాల్సి ఉండేది.

 Bigg Boss Telugu Ott To Begin In February 2022, Bigg Boss Telugu 5, Bigg Boss Ot-TeluguStop.com

కానీ ఈసారి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున బిగ్ బాస్ మరొక రెండు నెలలలో అనగా ఫిబ్రవరిలో మొదలవుతుందని ప్రకటించిన విషయం అందరికి తెలిసిందే.ఇకపోతే ప్రేక్షకులు బిగ్ బాస్ సీజన్ 6 ఎప్పుడు మొదలు అవుతుందా అని ఎదురుచూస్తున్నారు.

అలాంటి వారికి ఒక శుభవార్త.అదేమిటంటే బిగ్ బాస్ తెలుగు ఓటీటీ పేరుతో మొదటి సీజన్ ను వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి లో స్టార్ట్ చేయనున్నారు.

బుల్లితెరపై ప్రసారమయ్యే రెగ్యులర్ బిగ్ బాస్ లా ఈ బిగ్ బాస్ ఓటీటీ కూడా ప్రేక్షకులకు మంచి కిక్ ఇవ్వబోతోంది.అయితే బిగ్ బాస్ తెలుగు ఓటీటీలో మొదలవుతుందని ప్రేక్షకులకు తెలియగానే ఈ సారి ఎలా ఉండబోతుంది? ఎవరెవరు కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నారు? అన్న ఆసక్తి నెలకొంది.ఇక తొలిసారిగా కొత్త ఫార్మాట్ లో షోని ప్రారంభించేందుకు షో నిర్వాహకులు సిద్ధమయ్యారు.

బిగ్ బాస్ తెలుగు ఓటీటీ గురించి మేకర్స్ క్లారిటీ కూడా ఇచ్చారు.డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం కానుందని ప్రకటించారు.ఇక బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కోసం యాంకర్ వర్షిణిని ,అలాగే యాంకర్ శివ, ఢీ 10 టైటిల్ విన్నర్ రాజుని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతానికి ఈ ముగ్గురు పేర్లు ఫిక్స్ అయినట్లు పెద్దఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి.వీరితో పాటుగా షణ్ముఖ్ జస్వంత్ తో కలసి సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ లో నటించిన వైష్ణవి చైతన్యను కూడా మేకర్స్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

మరి ఆమె ఈ ఆఫర్ కు ఓకే చెబుతుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.బిగ్ బాస్ తెలుగు ఓటీటీ కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube