అమిత్ షా ఎంట్రీతో తెలంగాణ రాజకీయ వాతావరణం మారనున్నదా?

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకు సంచలన మలుపులతో ఆద్యంతం ఆసక్తికరంగా మారాయి.ప్రస్తుతం చాలా వరకు బీజేపీ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

 Will The Political Climate In Telangana Change With The Entry Of Amit Shah?/ Tel-TeluguStop.com

ఇప్పటికే తెలంగాణలో బీజేపీని పటిష్టం చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న  తరుణంలో తెలంగాణలో అమిత్ షా ఎంట్రీ అనేది రాజకీయంగా సంచలన విషయంగా మారింది.ఎందుకంటే ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో అమిత్ షా తన రాజకీయ వ్యూహాలను తెలంగాణపై ప్రయోగించి వచ్చే ఎన్నికల్లో ఎక్కువ స్థానాల్లో గెలిచి కాషాయ జెండా రెపరెపలాడించాలని చూస్తున్న పరిస్థితి ఉంది.

ఇప్పటి వరకు తెలంగాణలో రాజకీయ పరిస్థితులు చాలా ప్రశాంతంగా ఉన్న పరిస్థితుల్లో అమిత్ షా ఎంట్రీతో పూర్తి స్థాయిలో రాజకీయ వాతావరణం మారే అవకాశం కనిపిస్తోంది.

ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న ప్రకారం బెంగాల్ తరహా వాతావరణం ఉండే అవకాశం కనిపిస్తోంది.

ఎందుకంటే తమకు కావలిసింది దక్కించుకోవడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి బీజేపీ పెద్దలు వెనుకాడరు.అయితే కేసీఆర్ మాత్రం  అప్పటి  రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయంపై ఒక అవగాహనకు రావడమే కాకుండా అప్పటి పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలనే విషయంపై పూర్తి క్లారిటీతో ఉన్న పరిస్థితి ఉంది.

ప్రస్తుతం బీజేపీ మిషన్-19 తో ముందుకు సాగనున్నట్లు తెలుస్తోంది.

Telugu Bandi Sanjay, Bjp, Etala Rajender, Telangana, Trs, Ts Congress-Political

బీజేపీకి ఎంతో కొంత పటిష్టం కావడానికి అవకాశం ఉన్నదంటే ప్రధాన కారణం టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత ఉండడమే అని చెప్పవచ్చు.ఏది ఏమైనా చాలా రకాలుగా బీజేపీ పటిష్టం కావాలని చేస్తున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకి మధ్య భీకర రాజకీయ పోరు మాత్రం జరిగే అవకాశం ఉంది.మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube