టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రంగస్థలం లాంటి ఒక బ్లాక్ బస్టర్ సినిమాను రామ్ చరణ్ కు అందించాడు సుకుమార్.
అయితే వీరిద్దరి కాంబినేషన్ కి ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది.ఆ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతుంది అని పలుసార్లు వార్తలు పెద్దఎత్తున వినిపించాయి.
ఈ విషయం గురించి ఆలోచిస్తున్న సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు.ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో రామ్ చరణ్, సుకుమార్ ప్రాజెక్ట్ గురించి రాజమౌళి మాట్లాడిన మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.రామ్ చరణ్ కు సుకుమార్ ఒక కొత్త సినిమా ఓపెనింగ్ సీక్వెన్స్ ను వినిపించాడట.
ఆ విషయం గురించి నేను కచ్చితంగా మాట్లాడను.ఒకవేళ ఆ విషయం గురించి నేను మాట్లాడితే సుకుమార్ కు తప్పకుండా గుండెపోటు వస్తుంది అని తెలిపారు రాజమౌళి.
రామ్ చరణ్ కు చెప్పిన ఒక్క సీన్ చాలా కష్టమైనదని, అద్భుతంగా ఉంటుంది అని చెప్పుకొచ్చారు.ఈ విధంగా రాజమౌళి తన స్నేహితుడు సుకుమార్ కొత్త సినిమా మూవీ అప్డేట్ ను ఈ విధంగా సర్ప్రైజ్ ప్రకటన ఇస్తూ అభిమానులలో జోష్ నింపాడు రాజమౌళి.
రంగస్థలం సినిమా తర్వాత సుకుమార్, రామ్ చరణ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని తెలియడంతో అభిమానులు ఆ స్టోరీ ఏవిధంగా ఉండబోతుంది అని తెగ చర్చించుకుంటున్నారు.ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఆర్సి15 లో నటిస్తూ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ సినిమా అనంతరం ఆర్సి 16 వ సినిమాగా సుకుమార్ ప్రాజెక్టు ఉండబోతోంది అనే వార్తలు వినిపిస్తున్నాయి.