ఏపీలో మూసి వేస్తున్న థియేటర్ల వల్ల ఆర్‌ఆర్‌ఆర్‌ కు నష్టం ఎంత?

ఒక వైపు కరోనా థర్డ్‌ వేవ్‌ భయం.మరో వైపు ఏపీలో థియేటర్ల మూసి వేత వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ మళ్లీ వాయిదా పడుతుంది అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

 Rrr Movie Post Pone News Because Of Ap Theaters Issue Details, Rrr , Ap Govt, Mo-TeluguStop.com

ప్రతి రోజు కూడా మేకర్స్ సినిమా విడుదల ఆగదు.ఖచ్చితంగా విడుదల చేస్తామని అంటున్నారు.

ఆర్‌ ఆర్‌ ఆర్ సినిమా సంక్రాంతికి విడుదల అవ్వడం ఖాయం అని తేలిపోయింది.ఒక వేళ పరిస్థితులు మరీ దారుణంగా మారితే తప్ప కరోనా వల్ల అయితే సినిమా విడుదల ఆగదు అని తేలిపోయింది.

ఇక థియేటర్ల మూసి వేత వల్ల ఆర్‌ ఆర్‌ ఆర్‌ కు నష్టం జరగనుంది.అందుకే విడుదల ఆపేయబోతున్నారు అంటున్నారు.

సినిమా థియేటర్లు మూసి వేస్తున్నారు.వాటిని ఎప్పటికి తెరుస్తారో తెలియదు.

కనుక ఎలా సినిమా ను వాయిదా వేస్తారు అనేది ఆలోచించాలి.అయినా టికెట్ల రేట్లు అత్యంత తక్కువ ఉన్న చోట్ల మాత్రమే సినిమా థియేటర్లు మూతపడుతున్నాయి.

అంటే ఆ టికెట్ల రేట్లకు కనీసం సినిమా థియేటర్లను రన్ చేయలేం అనుకున్నప్పుడు మాత్రమే మూసి వేస్తున్నారు.ఒక వేళ ఆ థియేటర్లు ఉన్నా కూడా సినిమాకు వచ్చే ఫలితం ఏమీ లేదు.

ఎందుకంటే టికెట్ల రేట్లు అత్యల్పంగా ఉండటం వల్ల ఖర్చు ఎక్కువ కాని లాభం తక్కువ అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.అందుకే ఏపీలో థియేటర్లు మూత పడ్డా కూడా ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.

Telugu Ap, Ap Ticket Rates, Rajamouli Rrr, Ram Charan, Rrr, Theaters-Movie

లక్షల్లో వసూళ్లు తక్కువ అవుతాయేమో.మహా అయితే రెండు కోట్ల వరకు వసూళ్లు తగ్గితే తగ్గవచ్చు.అంతే తప్ప ఏపీలో థియేటర్ల మూత వల్ల పదుల కోట్లలో నష్టం జరుగదు అనేది విశ్లేషకుల అభిప్రాయం.అందుకే ఆర్‌ ఆర్‌ ఆర్‌ సినిమా కరోనా థర్డ్‌ వేవ్ వల్ల వాయిదా పడితే పడాలే తప్ప ఖచ్చితంగా ఏపీ లో టికెట్ల ఇష్యూ మరియు థియేటర్ల మూసి వేత వల్ల వాయిదా పడే అవకాశం లేదు అన్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube