బీసీలు ఎటువైపు.. కాపులు ఎటువైపు? చంద్రబాబు వ్యూహం ఫలించేనా?

రాష్ట్రంలో టీడీపీ అనేక వ్యూహాలు రచిస్తోంది.కానీ రాజకీయంగా ప్రస్తుత పరిస్థితులకు అవి అనుకూలంగా లేవనే చెప్పాలి.

 Where Are The Bcs  Where Are The Farmers Will Chandrababu's Strategy Work?, Chan-TeluguStop.com

అన్ని వర్గాల వారిని కలుపుకోవాలని చెబుతున్న టైంలో కేవలం కాపు సామాజిక వర్గం అండగా ఉండాలంటూ కోరుకోవడంపై రాజకీయంగా చర్చ మొదలైంది.ఏపీలో గెలుపోటములను కాలుపు డిసైడ్ చేయొచోచు.

కానీ వారే అధికార పీఠంపై కూర్చొబెడతారనే విషయాన్ని బలంగా చెప్పలేం.ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిస్తేనే విజయం సాధ్యమయ్యే చాన్స్ ఉంది.

ఒకప్పుడు ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీల ఓటు బ్యాంకు టీడీపీకి బలంగా ఉండేది.కానీ ప్రస్తుత కాలంలో ఆ సామాజిక వర్గాలన్నీ వైసీపీ పార్టీకి దగ్గరవుతూ వచ్చాయి.

గత ఎన్నికల టైంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్స్ ఈబీసీ కోటా నుంచి ప్రకటించడంతో టీడీపీకి బీసీలు దూరమయ్యారమై వైసీపీకి మద్దతుగా నిలిచారు.దీని వల్లే వైసీసీ అధికారం దక్కించుకుంది.

అయితే ప్రస్తుతం బీసీ ఓట బ్యాంకును తన వైపు మళ్లించుకునేందుకు టీడీపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

ఏపీలో కాపు సామాజిక వర్గం ఎవరి వైపు మద్దతు చూపితే వారికి బీసీలు వ్యతిరేకమవుతారు.

కాపుల రిజర్వేషన్ అంశమై ఈ దూరానికి కారణమని చెప్పవచ్చు.మరో విషయం ఏంటంటే కాపులు అందరూ ఒకే వైపు నిలుస్తారన్న నమ్మకం సైతం లేదు.

మరి ఈ టైంలో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంటే బీసీలు తెలుగుదేశం పార్టీకి యాంటీ అవుతారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.పరిస్థితులు ఇలా ఉండటంతో టీడీపీ వ్యూహాలు ప్రస్తుత పరిస్థితులకు అనుకూలంగా లేవనే చెప్పాలి.

ఎన్నో ఏండ్లు టీడీపీకి సపోర్ట్ గా ఉన్న బీసీ సామాజిక వర్గం.గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ వైపు టర్న్ కావడంతో వారికి జనగ్ ప్రభుత్వం నామినేటెడ్ పదవులను సైతం కట్టబెట్టింది.

ఈసారీ కాపులను, బీసీలను తమ వైపు తిప్పుకునేందుకు ఇప్పటి నుంచే టీడీపీ ప్రయత్నాలు మొదలుపెట్టింది.మరి ఎవరు ఏ పార్టీని ఆదరిస్తారో వేచిచూడాలి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube