కెసీఆర్ పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణ...కెసీఆర్ స్పందించేనా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు బలపడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.టీఆర్ఎస్ పార్టీ తరువాత ప్రత్యామ్నాయ స్థానం కోసం బీజేపీ, కాంగ్రెస్ మధ్య పెద్ద ఎత్తున పోటీ నెలకొన్న తరుణంలో కెసీఆర్ టార్గెట్ గా రేవంత్ రెడ్డి విమర్శనాస్త్రాలు సంధిస్తున్న పరిస్థితి ఉంది.

 Rewanth Reddy Sensational Allegation Against Kcr . Will Kcr Respond Telangana P-TeluguStop.com

అయితే గత కొన్ని నెలలుగా వరి ధాన్యం కొనుగోలుపై పెద్ద ఎత్తున బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు పేలుతున్న సంగతి తెలిసిందే.అయితే కేంద్ర ప్రభుత్వం యాసంగిలో వరి ధాన్యం కొనుగోలు చేయలేమని ఖరాఖండీగా చెప్పిన విషయం తెలిసిందే.

అయితే దీనిపై ఏకంగా కెసీఆర్ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే.అంతేకాక యాసంగిలో మిల్లర్లతో ఒప్పందం ఉన్నవాళ్లే వరి సాగుపై ముందుకు రావాలని మిగతా రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపాలని కెసీఆర్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా  రేవంత్ రెడ్డి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో తెలంగాణ రైతులందరినీ వరి వేయవద్దని కోరిన కెసీఆర్ తన ఫామ్ హౌస్ లోని 150 ఎకరాల్లో వరి పండిస్తూ రైతులను మోసం చేస్తున్నారని తక్షణమే ఈ విషయంపై రైతులకు కెసీఆర్ సమాధానం చెప్పాలని, కావున రైతులందరు యాసంగిలో వరి మాత్రమే పండించాలని ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయదో చూస్తామని రేవంత్ రెడ్డి అభిప్రాయ పడ్డారు.

Telugu Bandi Sanjay, Bjp, Formmers, Paddy, Revanth Reddy, Telangana, Trs, Ts Con

అయితే ప్రస్తుతం కెసీఆర్ పై రేవంత్ రెడ్డి ఫామ్ హౌజ్ లో వరి పండిస్తున్నారనే ఆరోపణ రాజకీయ వర్గాలలో చర్చగా మారింది.అయితే టీఆర్ఎస్ పార్టీ పరంగా ఇంకా రేవంత్ ఆరోపణలపై ఇంకా స్పందించక పోయినప్పటికీ త్వరలో స్పందించే అవకాశం ఉంది.ఏది ఏమైనా రేవంత్ రెడ్డి పార్టీ పరంగా మరింత సరికొత్త వ్యూహంతో రాజకీయ వేడిని రగిలిస్తున్న పరిస్థితి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube