బీజేపీ దీక్షకు టీఆర్ఎస్ బ్రేకులు ? ఆంక్షల విధింపు ?

టిఆర్ఎస్ ప్రభుత్వం పై దూకుడు పెంచాలని అలా డిసైడ్ అయ్యారో లేదో వెంటవెంటనే దానికి సంబంధించిన కార్యచరణపై తెలంగాణ బిజెపి నాయకులు దృష్టిపెట్టారు.ముఖ్యంగా బిజెపి అధిష్టానం పెద్దల నుంచి పూర్తిస్థాయిలో భరోసా రావడంతో,  ఇక తెలంగాణలో దూకుడు పెంచాలని నిర్ణయించారు.

 Reason For The Postponement Of Nirudyoga Deeksha Of Bjp By Trs Government Detail-TeluguStop.com

ఈ మేరకు ఈ నెల 27వ తేదీ నిరుద్యోగ దీక్ష చేపట్టేందుకు బిజెపి సిద్ధమైంది.ఈ సభకు భారీగా జనాన్ని సమీకరించి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేసేందుకు బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

నిరుద్యోగ దీక్ష ద్వారా,  యువకుల్లో బీజేపీ కి ఆదరణ పెరిగేలా చేసుకుని అధికార పార్టీ టిఆర్ఎస్ కు రాబోయే ఎన్నికల్లో పరాజయం కలిగే విధంగా బీజేపీ ప్లాన్ చేసుకుంటోంది.

అందుకే ఈ నెల 27 న జరగబోయే సభను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అయితే టిఆర్ఎస్ ప్రభుత్వం బిజెపి కి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.బిజెపి సభ ను దృష్టిలో పెట్టుకునో,  మరో కారణమో సరైన క్లారిటీ లేదు కానీ, తెలంగాణలో కోవిడ్ ఆంక్షలు విధిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

దీంతో రేపు బిజెపి నిర్వహించబోయే నిరుద్యోగ దీక్ష పై పోలీసులు ఆంక్షలు విధించారు.హైకోర్టు ఆదేశాల ప్రకారమే ఈ ఆదేశాలు వెలువడ్డాయని,  ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం బహిరంగ సభలు నిర్వహించేందుకు అనుమతులు నిరాకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇప్పటికే దీక్షకు అనుమతి ఇవ్వాలంటూ బిజెపి పోలీసులకు దరఖాస్తు చేసింది.

Telugu Bjp, Covid, Karona, Trs-Political

కానీ ఇప్పుడు ప్రభుత్వం విధించిన ఆంక్షల కారణంగా ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ సభకు అనుమతి వచ్చే అవకాశం లేకపోవడంతో,  బిజెపి ఆశలపై టిఆర్ఎస్ నీళ్ళు చిమ్మినట్టు గా కనిపిస్తోంది.ఇప్పటికే తెలంగాణలో బిజెపి టిఆర్ఎస్ మధ్య తీవ్రమైన గత కొద్ది రోజుల క్రితం తెలంగాణ బిజెపి నాయకులు ఢిల్లీకి వెళ్లి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలిశారు.ఈ సందర్భంగా టిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకోవాలని ఆయన గట్టిగా సూచించడంతో వరుసగా తెలంగాణలో అనేక కార్యక్రమాలను రూపొందించేందుకు ఆందోళన చేపట్టేందుకు బిజెపి సిద్ధమవుతోంది.

అయితే బిజెపి దూకుడుకు బ్రేక్ చేసేందుకు అడుగడుగూ ప్రయత్నిస్తున్న టిఆర్ఎస్ కు ఇప్పుడు కోవిడ్ ఆంక్షలు బీజేపీపై రాజకీయ కక్ష తీర్చుకునేందుకు ఉపయోగపడుతున్న టు గా కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube