నేను క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.. అందరూ పేరున్నవాళ్లే: ఉర్ఫీ జావేద్

బాలీవుడ్ బిగ్ బాస్ బ్యూటీ ఉర్ఫి జావేద్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వాళ్లకు ఈమె బాగా సుపరిచితమే.

 Urfi Javed Reveals That She Has Experienced Casting Couch From Some Big Names In-TeluguStop.com

ఈమె నిత్యం తన హాట్ ఫోటో షూట్లతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకుంది.

ఈమె నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లతో కుర్రకారును హిటేక్కిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే కొన్నిసార్లు నెటిజన్స్ నుంచి విమర్శలను కూడా ఎదుర్కొంది.

ఈమె విచిత్రమైన ఫ్యాషన్ సెన్స్ తో వార్తల్లో నిలుస్తూ ఎక్కువ ట్రోల్స్ కు గురవుతూ ఉంటుంది.

ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఒక ఇంటర్వ్యూలో జావేద్ మాట్లాడుతూ.ఇండస్ట్రీలో అందరి హీరోయిన్స్ అమ్మాయిలలాగే  నేను కూడా ఒక క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినే.

ఒకసారి నన్ను దీని గురించి ఫోర్స్ చేశాడు కానీ నా అదృష్టం కొద్దీ నేను బయటపడ్డాను.సినీ పరిశ్రమలో పెద్ద మనుషులుగా మంచి పేరున్న వ్యక్తులే నన్ను క్యాస్టింగ్ కౌచ్ చేయడానికి ప్రయత్నించారు.

ఆ వ్యక్తులు తలచుకుంటే ఇప్పుడు ఏమైనా, చేయగలరు.ఆ వ్యక్తులు చాలా పవర్ ఫుల్ అని చెప్పుకొచ్చింది.

అందుకే అటువంటి వారి పేర్లు బయటకు చెప్పలేనని తన అనుభవాలను పంచుకుంది ఈ ముద్దుగుమ్మ.

Telugu Netizens, Urfi Javed-Movie

అలాగే మొదట ముంబైకి వచ్చిన క్రమంలో చాలా బిజీ అయిపోతాను అని భావించినప్పటికీ అలా జరగలేదు.డబ్బుల కోసం టీవీలోనూ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేయాల్సి వచ్చింది.అలాగే నాకున్న నెగిటివ్ ఫాలోయింగ్ వల్లే ఇప్పటికీ చాలా రిజక్షన్స్ ఎదుర్కొంటున్నాను అని తెలిపింది ఈ బిగ్ బాస్ బ్యూటీ.

ఇక తనపై జరిగే ట్రోలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోనని తెలిపింది.కేవలం ఉర్ఫి జావేద్ మాత్రమే కాకుండా సినీ ఇండస్ట్రీ లో ఇప్పటికే ఎంతో మంది హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ విషయంలో నోరు మెదిపిన విషయం తెలిసిందే.

అలాంటి వారిలో నేను కూడా ఒకరు అంటూ తాజాగా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఉర్ఫి జావేద్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube