2021.. ఈ స్టార్ డైరెక్టర్లకు అస్సలు కలిసిరాలేదుగా!

ఈ ఏడాది వరుసగా చాలా సినిమాలు తెరకెక్కాయి.చాలా వరకు మంచి మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా అలరించాయి.

 2021 These Star Directors Have Badluck This Year, Tollywood, Directors, Film Ind-TeluguStop.com

ఇక హీరోలు సైతం తమ సినిమా సక్సెస్ కావడంతో మంచి పేరు సంపాదించుకున్నారు.ఆ సినిమా డైరెక్టర్లు కూడా ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

అందులో బోయపాటి శ్రీను, గోపీచంద్ మలినేని, శ్రీకాంత్ అడ్డాల, భాస్కర్ వంటి పలువురు దర్శకులు ఈ ఏడాది మంచి సక్సెస్ తో ముందుకు వచ్చారు.అంతేకాకుండా మరిన్ని సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు.

ఇదిలా ఉంటే ఈ సినిమాలతో పోటీగా వచ్చిన మరిన్ని సినిమాలు ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి.

పైగా నిరాశ పరిచిన సినిమా డైరెక్టర్ లు కూడా బాగా నిరాశ చెందారు.

ఎన్నో ఆశలు పెట్టుకొని ఈ ఏడాది సినిమాను తెరకెక్కించగా ఆ స్టార్ డైరెక్టర్లకు మాత్రం అసలు కలిసి రాలేదు.ఇంతకు వాళ్ళు ఎవరంటే డైరెక్టర్ శివ నిర్వాణ, అజయ్ భూపతి, మారుతి.

Telugu Boyapati Srinu, Directors, Tollywood-Movie

శివ నిర్వాణ: టాలీవుడ్ డైరెక్టర్ శివ నిర్వాణ గురించి ఆయన దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.మొదట టీచర్ గా పనిచేసిన ఈయన ఆ తర్వాత సినిమాలపై ఆసక్తి ఉండటంతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.

దాంతో ఆయన తొలిసారిగా అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు.ఆ సమయంలోనే తన పేరు వెనుక నిర్వాణ చేసుకున్నాడు.ఇక 2017 లో నిన్ను కోరి సినిమాకు దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

Telugu Boyapati Srinu, Directors, Tollywood-Movie

ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఆ తర్వాత మజిలీ సినిమా కూడా తెరకెక్కించగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకుంది.కానీ ఈ ఏడాది ట్రక్ జగదీష్ సినిమాను తెరకెక్కించగా ఈ సినిమా సక్సెస్ కాలేకపోయింది.

అజయ్ భూపతి: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అజయ్ భూపతి తొలిసారిగా 2018 లో ఆర్ఎక్స్ 100 సినిమా తో దర్శకుడి గా పరిచయమయ్యాడు.ఈయన ఈ సినిమా కంటే ముందు సహాయ దర్శకుడుగా పని చేశాడు.

అలా చాలా సినిమాలలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, చీఫ్ కోడైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్ గా చేశాడు.ఆ తర్వాత ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు.

ఇక ఈ ఏడాది శర్వానంద్, సిద్ధార్థ్ లతో కలసి మహాసముద్రం సినిమాను తెరకెక్కించాడు.ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేదు.

Telugu Boyapati Srinu, Directors, Tollywood-Movie

మారుతి: డైరెక్టర్ దాసరి మారుతి గురించి, ఆయన దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.అతి తక్కువ సమయంలో మంచి మంచి సినిమాలను తెరకెక్కించిన ఈయన మంచి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు.

దీంతో ఈయన స్టార్ డైరెక్టర్ గా కూడా ఎదిగాడు.గత ఏడాది ప్రతి రోజు పండగే సినిమా తో మంచి సక్సెస్ అందుకున్నాడు.ఇక ఈ ఏడాది మంచి రోజులు వచ్చాయి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని రాగా ఈ సినిమా అంతా సక్సెస్ కాలేకపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube