సీజేఐ వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కు భారీ మైలేజీ వచ్చినట్టేనా?

తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకు అధికార ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతూ హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి ఉంది.అయితే ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీయే టార్గెట్ గా ప్రతిపక్షాలు విరుచుకపడుతున్న పరిస్థితులను మనం చూస్తున్నాం.

 Did Trs Get Huge Mileage With Cji Comments Telangana Politics, Kcr-TeluguStop.com

ఎందుకంటే ఇంకా రెండున్నర సంవత్సరాలలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో టీఆర్ఎస్ పార్టీని మూడో సారి అధికారంలోకి రానివ్వకూడదనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న పరిస్థితి ఉంది.మూడో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఇక తెలంగాణలో ప్రతిపక్షాలు అనేవి ఇక మరింత బలహీనంగా మారే అవకాశం ఉంది.

అయితే తాజాగా జరిగిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ మీడియేటర్ సెంటర్ ప్రారంభోత్సవంలో భాగంగా సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో సంచలనంగా మారాయి.

Telugu @cm_kcr, @trspartyonline, Telangana-Political

అయితే సీజేఐ చేసిన వ్యాఖ్యలేంటనే విషయాన్ని పరిశీలిస్తే న్యాయ వ్యవస్థలో నూతన సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశామని మాకు ఎటువంటి స్పందన రాలేదని అంతేకాక కేంద్ర ప్రభుత్వ నిధులు కొంత రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలుపుకొని ఏ ప్రభుత్వమయినా భవనాలు నిర్మిస్తుంది.కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ఈ సెంటర్ ను నిర్మించడం చాలా అభినందనీయమైన విషయమని జస్టిస్ రమణ కొనియాడారు.అయితే సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రమణ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడటంతో టీఆర్ఎస్ పార్టీకి భారీ మైలేజ్ వచ్చిన్నట్టేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

ఎందుకంటే చీఫ్ జస్టిస్ అభినందించడంతో ఈ విషయాన్ని కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ భవిష్యత్తులో ఉపయోగించుకునే అవకాశం ఉండడమే కాకుండా అప్పటి వరకు చాలా ప్రజామోద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.మరి రానున్న రోజుల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయనేది చూడాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube