మమతా మోహన్ దాస్ ఇండియన్ కాదా... మరీ ఇండియాలో హీరోయిన్ ఎలా అయ్యింది?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో యమదొంగ, చింతకాయల రవి, కింగ్,కేడి వంటి చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మమతా మోహన్ దాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈమె ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని మంచి పేరు సంపాదించుకున్న సమయంలో క్యాన్సర్ మహమ్మారి ఆశలపై నీళ్లు చల్లింది.

 Mamata Mohandas Is Not An Indian But How Did She Become A Heroine In India Mamat-TeluguStop.com

అయినా ఏమాత్రం కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో క్యాన్సర్ ను జయించి తిరిగి ఇండస్ట్రీ లోకి రీఎంట్రీ ఇచ్చింది.ఈ క్రమంలోనే మమతా మోహన్ దాస్ నటించిన రుద్రంగి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈమె బహ్రెయిన్‌లో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఏకైక సంతానంగా జన్మించారని తన తండ్రి ఒక బ్యాంక్ ఇన్వెస్టర్ తన తల్లి లెక్కల టీచర్ అని ఈమె తెలిపారు.ఇక ఈమె తల్లి తన చదువు కోసం తన బాగోగులు చూసుకోవడం కోసం ఏకంగా తన ఉద్యోగాన్ని ఇచ్చి పెట్టి పూర్తిగా తన కోసమే తన జీవితాన్ని అంకితం చేసిందని తెలిపారు.

చిన్నప్పుడు ఎంతో మొహమాటంగా ఉండటంవల్ల చిన్నప్పుడు పెద్దగా స్నేహితులను సంపాదించుకోలేకపోయానిని తెలిపిన ఈమె ఉన్నత చదువుల కోసం ఇండియాకు తిరిగి వచ్చి బెంగుళూరులో స్థిరపడినట్టు తెలిపారు.

Telugu Indian, Mamata Mohandas, Tollywood, Yama Donga-Movie

ఇక ఉన్నత చదువులు చదువుతున్న నేపథ్యంలో తనకు నటనపై ఏమాత్రం ఆసక్తి లేకపోయినా అవకాశాలు వచ్చాయి ఇలా అవకాశాలు రావడంతో ఇండస్ట్రీలోకి వచ్చానని మమతామోహన్ దాస్ వెల్లడించారు.ఇలా ఇండస్ట్రీలో మంచి గుర్తింపువస్తున్న సమయంలో క్యాన్సర్ తనని తిరిగి వెనక్కి నెట్టిందని అయితే తను ఏమాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా క్యాన్సర్ నుంచి బయటపడి తిరిగి సినిమాల్లో నటిస్తున్నానని తెలిపారు.ప్రస్తుతం ప్రతి ఒక పాత్రను మూస ధోరణిలో కాకుండా విభిన్న పాత్రల ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నానని ఈమె తెలియజేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube