అదిరిపోయే ప్రయోజనాలు ఆఫర్ చేస్తున్న కొత్త ఎల్ఐసీ పాలసీ.. పూర్తి వివరాలివే..!

ఇతర బీమా సంస్థలకు పోటాపోటీగా కొత్త పాలసీలను తీసుకొస్తోన్న భీమా సంస్థ ఎల్ఐసీ తాజాగా ధనరేఖ అనే సరికొత్త సేవింగ్స్ ఇన్సూరెన్స్ పాలసీని పరిచయం చేసింది.ఈ పాలసీ డిసెంబర్ 13 నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చింది.

 New Offer, Latest News, New Policy, Lic Holders,latest News-TeluguStop.com

మరి ఈ కొత్త ధనరేఖ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందామా! ఎల్ఐసీ సంస్థ ధన రేఖ పాలసీలో ఎన్నో ప్రయోజనాలు, ప్రత్యేక ఫ్యూచర్లను అందిస్తుంది.ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేక ప్రీమియం ధరలు ఆఫర్ చేస్తోంది.ఈ పాలసీలో జాయిన్ అయిన వారికి కనీసం రూ.2 లక్షలు ఖచ్చితంగా అందుతాయి.అయితే గరిష్ఠ సమ్ అస్యూర్డ్ పై మాత్రం ఎలాంటి పరిమితులు లేవు.మీరు అధిక హామీ కోసం ఎంతైనా పెట్టుబడి పెట్టొచ్చు.

వయోపరిమితి విషయానికి వస్తే 90 రోజుల చిన్న పిల్లలు నుంచి ఎనిమిదేళ్ల బాలబాలికల వరకు ధనరేఖ ప్లాన్ లో జాయిన్ కావచ్చు.అయితే తల్లిదండ్రుల తరపున చిన్న పిల్లల పేరు మీద ఎల్ఐసీ పాలసీ ఓపెన్ చేయవచ్చు.

గరిష్ఠ వయోపరిమితిని 35 నుంచి 55 ఏళ్లుగా నిర్ణయించింది ఎల్ఐసీ.ఈ ప్లాన్ 20, 30, 40 సంవత్సరాల టర్మ్ లతో లాంచ్ అయ్యింది.

Telugu Latest, Lic Holders, Policy-Latest News - Telugu

ఒకవేళ మీరు 20 ఏళ్ల టర్మ్ పాలసీ తీసుకుంటే పదేళ్ల వరకు ప్రీమియం చెల్లిస్తూనే ఉండాలి.30 ఏళ్ల అయితే పదిహేనేళ్లు.40 ఏళ్ళు అయితే 20 ఏళ్లు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది.లేదంటే మీరు సింగిల్ ప్రీమియం చెల్లించవచ్చు.

ఇలా సింగిల్ ప్రీమియం చెల్లించడం ద్వారా బేసిక్ హామీపై 125% మొత్తాన్ని పొందొచ్చు.మనీ బ్యాక్ అంటూ తిరిగి ఇచ్చిన మొత్తాన్ని మినహాయించి గ్యారెంటీగా ప్రకటించిన మొత్తాన్ని మెచ్యూరిటీ సమయంలో చెల్లిస్తారు.

ఈ పాలసీని ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్ లైన్‌లో కూడా కొనుగోలు చేయవచ్చు.ఈ ప్లాన్‌లో జాయిన్ అయిన వారికి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది.

అలాగే సర్వైవల్ బెనిఫిట్ ఎప్పటికప్పుడు పాలసీదారులకు అందుతూనే ఉంటుంది.ఇందులో ఈ బెనిఫిట్ అందరినీ ఆకర్షిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube