కమెడియన్ పద్మనాభం గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా?

రంగస్థల నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా ఇండస్ట్రీలో బి.పద్మనాభం తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.

 Interesting Facts About Famous Comedian Padmanabham , Comedian Padmanabham , Jou-TeluguStop.com

కడప జిల్లాలోని సింహాద్రిపురం గ్రామంలో 1931వ సంవత్సరం ఆగష్టు నెల 20వ తేదీన పద్మనాభం జన్మించారు. పద్మనాభం తండ్రి శేషయ్య వీరన్నగట్టుపల్లె గ్రామానికి కరణంగా ఉండేవారు.

చిన్నప్పటి నుంచి పద్మనాభంకు మ్యూజిక్, పద్యాలు ఇష్టం కాగా బాల్యంలో పద్మనాభం సినిమాల్లోని పాటలు, పద్యాలను అనుకరిస్తూ ఉండేవారు.

మొదట్లో నాటకాల్లో నటించిన పద్మనాభం ఆ తర్వాత రోజుల్లో సినిమాలలో ఆఫర్లను సొంతం చేసుకున్నారు.నటుడిగా పద్మనాభం తొలి సినిమా మాయాలోకం కాగా పద్మనాభం సినిమాల్లో పాటలు కూడా పాడేవారు.1964 సంవత్సరంలో పద్మనాభం సొంతంగా రేఖా అండ్ మురళీ ఆర్ట్స్ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించారు.ఈ నిర్మాణ సంస్థలో తెరకెక్కిన శ్రీశ్రీశ్రీ మర్యాదరామన్న సినిమాతో ఎస్పీ బాలు సింగర్ గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.

Telugu Padmanabham, Journalistbk, Struggles-Movie

2010 సంవత్సరం ఫిబ్రవరి నెల 10వ తేదీన పద్మనాభం  చెన్నైలో గుండెపోటుతో మృతి చెందారు.ప్రముఖ జర్నలిస్ట్ బీకే ఈశ్వర్ ఒక ఇంటర్వ్యూలో పద్మనాభం గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.పద్మనాభంకు సినిమాల విషయంలో మంచి అభిరుచి ఉండేదని సింపుల్ బడ్జెట్ లోనే ఆయన సినిమాలను నిర్మించారని తెలిపారు.

పద్మనాభం నిర్మాతగా తీసిన సినిమాలలో కూడా కొన్ని ఫ్లాప్ అయ్యాయని ఈశ్వర్ అన్నారు.

Telugu Padmanabham, Journalistbk, Struggles-Movie

పద్మనాభం ఫైనాన్స్ విషయంలో మోసపోయారని అందువల్ల ఆయన ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారని ఈశ్వర్ చెప్పుకొచ్చారు.ఆ సమయంలో పద్మనాభంకు మూవీ ఆఫర్లు రాలేదని ఈశ్వర్ అన్నారు.ఆర్థిక ఇబ్బందుల వల్లే పద్మనాభం ఎన్నో కష్టాలు పడ్డారని ఈశ్వర్ చెప్పుకొచ్చారు.

సినిమాలలో ఆఫర్లు తగ్గిన తర్వాత పద్మనాభం కొన్ని నాటకాల్లో కూడా నటించారు.ఈ తరం ప్రేక్షకుల్లో కూడా పద్మనాభం కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube