రేర్ ఫొటో షేర్ చేసిన హ‌ర్భ‌జ‌న్‌.. ఇందులో ఉన్న మిగ‌తా క్రికెట‌ర్ల‌ను గుర్తు ప‌ట్టండి..

కొందరు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంటారు.అలాంటి వారిలో చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు కొందరైతే, క్రీడారంగానికి చెందిన వారు కూడా ఉన్నారు.

 Rare Photo Shared By Harbhajan Remember The Other Cricketers In It .. Harbhajan-TeluguStop.com

స్పోర్ట్స్ విషయానికొస్తే టీం ఇండియా మాజీ ఆటగాడు, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సామాజిక మాధ్యమాల్లో యాక్టివ్‌గా ఉంటూనే కొన్ని ప్రత్యేకమైన సందర్భాలను అభిమానులతో పంచుకుంటుంటారు.తాజాగా బజ్జీ చేసిన పోస్టు వైరల్ అవుతోంది.

తాను యంగ్ ప్లేయర్‌గా ఉన్నప్పటి పిక్‌ను షేర్ చేసిన మాజీ ఆటగాడు తనతో పాటు ఉన్న క్రీడాకారులు ఎవరో గుర్తించాలని కామెంట్ చేశాడు.

హర్బజన్ సింగ్ గురించి అతని ఆట గుర్తించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట.

బజ్జీ వేసే బంతులు స్ప్రింగ్స్‌లా తిరుక్కుంటూ వచ్చి స్టంప్స్‌కు తాకుతుంటాయి.ముందుగా బ్యాట్‌మెన్స్‌ను కన్ఫ్యూజ్‌తో పాటు కంగారు పెడుతుంటాయి.అయితే, బజ్జీ కుర్ర ప్లేయర్‌గా ఉన్న టైంలో ఆడిన అండర్‌-19 వరల్డ్ కప్ నాటి తీపి గుర్తులను అభిమానులతో పంచుకున్నాడు.1997-98లో సౌత్ ఆఫ్రికాలో జరిగిన అండర్‌-19 వరల్డ్ కప్‌కు చెందిన ఓ ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు బజ్జీ.ఇందులో మనోడితో పాటు మరో ఇద్దరు పాక్ ప్లేయర్స్ ఉన్నారు.

Telugu Cricket, Harbhajan Singh, Hasan Raja, Imran Tahir, India-Latest News - Te

‘పెహచానో తో మానే’ (మమ్మల్ని గుర్తు పట్టండి చూద్దాం) అంటూ ట్యాగ్ తగిలించాడు.ముందుగా హర్భజన్‌ సింగ్‌ను ఎవరైనా సులువుగా గుర్తిస్తారు.కానీ మరో ఇద్దరు ఆటగాళ్లను గుర్తించడం కొద్దిగా రిస్క్ అయితే, ఇందులో అర్థనగ్నంగా ఉన్నది మాత్రం ఒకప్పటి పాక్ అండర్‌-19 బౌలర్ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాకు ఆడుతున్న ఇమ్రాన్‌ తాహీర్‌.

మరొకరు పాక్‌ ప్లేయర్ హసన్‌ రాజా తాహీర్ అప్పట్లో పాక్ అండర్ 19 జట్టుకు ఆడాడు.పాక్‌లోనే పుట్టి పెరిగిన అతని కుటుంబం దక్షిణాఫ్రికాకు వలస వెళ్లింది.దీంతో దక్షిణాఫ్రికాలో స్థిరపడి అక్కడి జట్టు తరపున ఆడేందుకు అవకాశం పొందాడు.ఇక హసన్‌ రాజా మాత్రం పాక్‌ జట్టు తరపున కొన్ని ఇంటర్నేషనల్ మ్యాచులు కూడా ఆడాడు.1997-98 అండర్‌- 19 వరల్డ్ కప్‌లో భారత్, పాక్ జట్లు ఫైనల్ చేరుకోకపోయినా.ఇండియా పాక్‌ను ఓడించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube