సిరికి షాక్ ఇచ్చిన షణ్ముఖ్ జశ్వంత్.. నా నెత్తి మీద ఎక్కకు అంటూ?

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో ప్రేక్షకాదరణతో పాటు మంచి రేటింగ్స్ ను సొంతం చేసుకుంటోంది.షణ్ముఖ్ సిరి జోడీ గురించి కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే మరి కొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.

 Bigg Boss 5 Telugu Promo Shanmukh Serious Arguement Siri Role Play Task , Big Bo-TeluguStop.com

అయితే తాజాగా రిలీజైన ప్రోమోలో షణ్ముఖ్ జశ్వంత్ సిరితో మరోసారి గొడవ పడ్డారు.షణ్ముఖ్ సిరితో సిరి ఎవరితోనైనా ఎమోషనల్ గా కనెక్ట్ అయితే తాను ఆపానని చెప్పుకొచ్చారు.

సిరిని ఎవరో అప్పడం అంటే తాను వాదించానని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.సిరి వాళ్ల అమ్మ బిగ్ బాస్ హౌస్ మేట్స్ ముందు హగ్గుల గురించి మాట్లాడిందంటూ షణ్ముఖ్ కామెంట్లు చేశారు.

తాను నెగిటివ్ కాకపోయినా నెగిటివ్ గా ఆలోచిస్తున్నానని షణ్ముఖ్ చెప్పుకొచ్చారు.అవతలి వ్యక్తుల ముందు తాను తక్కువైనా పరవాలేదని అనుకుని సిరి కోసం తాను ఫైట్ చేస్తున్నానని షణ్ముఖ్ కామెంట్లు చేస్తున్నారు.

అప్పుడూ తాను నెగిటివ్ అవ్వలేదని వెళ్లిపోవాలని సిరికి షణ్ముఖ్ సూచనలు చేశారు.నా నెత్తిమీద ఎక్కవద్దు వెళ్లిపో అంటూ షణ్ముఖ్ కామెంట్లు చేశారు.

అయితే షణ్ముఖ్ ప్రవర్తన గురించి నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.షణ్ముఖ్ తన పద్ధతిని మార్చుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.

ప్రతి చిన్న విషయాన్ని షణ్ముఖ్ జశ్వంత్ భూతద్దంలో పెట్టి చూస్తున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

ఫినాలే దగ్గర పడుతున్న సమయంలో ఇలాంటి ప్రవర్తన వల్ల షణ్ముఖ్ కు మేలు కంటే కీడు జరిగే అవకాశాలు ఎక్కువని నెటిజన్లు భావిస్తున్నారు.షణ్ముఖ్ బిగ్ బాస్ విన్నర్ అవుతారని అభిమానులు భావిస్తున్న తరుణంలో షణ్ముఖ్ తన ప్రవర్తన ద్వారా పోల్ అయ్యే ఓట్ల సంఖ్యను తగ్గించుకుంటున్నారు.మరోవైపు ప్రేక్షకుల మధ్య ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే చర్చ జరుగుతోంది.

సన్నీ విన్నర్ అవుతారని మెజారిటీ ప్రేక్షకులు భావిస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube