వరుస హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం విక్రం కె కుమార్ డైరక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా థ్యాంక్యు.ఈ సినిమాలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా అవికా గోర్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది.
థ్రిల్లర్ జోనర్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇదిలాఉంటే ఈ సినిమాను థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట నిర్మాత దిల్ రాజు.
థియేటర్లు అన్ని తెరచుకుని సినిమాలు సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంటే ఇలాంటి టైం లో అది మంచి ఫాం లో ఉన్న నాగ చైతన్య సినిమా ఓటీటీ రిలీజ్ చేయడం ఏంటని ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
నాగ చైతన్య థ్యాంక్యు దాదాపు ఓటీటీ రిలీజ్ కే ఓటు వేస్తున్నారట మేకర్స్.
అయితే దీనికి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రావాల్సి ఉంది.ఓటీటీల నుండి భారీ ఆఫర్ రావడం వల్ల మేకర్స్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు.
ఏది ఏమైనా థ్యాంక్యు ఓటీటీ రిలీజైతే మాత్రం అక్కినేని ఫ్యాన్స్ హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.ఈ సినిమాతో పాటుగా నాగ చైతన్య నాగార్జునతో కలిసి బంగార్రాజు సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.