బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ అఖండ సినిమా రీసెంట్ గా రిలీజై ఘన విజయం సాధించింది.ఈ సినిమా సక్సెస్ తో చిత్రయూనిట్ ఫుల్ జోష్ లో ఉంది.
ఇక ఈ సినిమా సక్సెస్ జోష్ చూసి అఖండ సీక్వెల్ మూవీ డిస్కషన్ వచ్చింది.అఖండ సినిమాకు కొనసాగింపుగా సీక్వెల్ తీయాలని ఫ్యాన్స్ కోరుతున్నారు.
ఇటీవల జరిగిన చిత్రయూనిట్ ఇంటర్వ్యూలో కూడా ఈ అంశం గురించి చర్చించారు.మంచి కథ వస్తే అఖండ సీక్వెల్ తీసేందుకు రెడీ అని బాలకృష్ణ, బోయపాటి శ్రీను అన్నారు.
సింహా, లెజెండ్, అఖండ మూడు సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ లో నాల్గవ సినిమా అది కూడా అఖండ సీక్వెల్ అయితే ఆ లెక్క వేరేలా ఉంటుందని చెప్పొచ్చు.బాలకృష్ణని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కు, ప్రేక్షకులకు నచ్చుతుందో బాగా తెలిసిన బోయపాటి శ్రీను అఖండగా బాలకృష్ణకు అదిరిపోయే హిట్ ఇచ్చాడు.
తప్పకుండా వీరి కాంబినేషన్ లో మరో సినిమా అది కూడా అఖండ సీక్వెల్ అయితే నందమూరి ఫ్యాన్స్ కు మళ్లీ పండుగే అని చెప్పొచ్చు.ప్రస్తుతం బాలకృష్ణ 107వ సినిమాగా గోపీచంద్ మలినేని డైరక్షన్ లో చేస్తున్నాడు.
ఆ సినిమా కూడా మాస్ మసాలా స్టోరీగా వస్తుందని తెలుస్తుంది.