సీఎం స్టాలిన్ మరో కీలక నిర్ణయం..!

మొదటిసారి సీఎం అయిన ఎం.కె స్టాలిన్ మొదటి నుండి తన మార్క్ చూపిస్తున్నారు.

 Cm Stalin Announced 50000 Rs Exgratia For Corona Death Families, Cm Stalin , An-TeluguStop.com

తమిళనాడుకి ఎలాంటి విపత్తు వచ్చినా సమర్ధవంతగా ఎదుర్కుంటూ మంచి నేతగా మార్కులు కొట్టేస్తున్నారు.తనదైన శైలిలో పరిపాలన సాగిస్తున్న స్టాలిన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఆయన తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలకు ఎంతో ఉపయోగకరం కానుంది.తమిళనాడులో కరోనా కారణంగా మరణించిన వారి కుటుంబాలకు 50 వేల పరిహారాన్ని ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించారు.

దానికి సంబందించిన ఉత్తర్వులు మంగళవారం ప్రభుత్వం జారీ చేసింది.

ఈ సహాయాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుండి అందించనున్నారని తెలుస్తుంది.

ఇక ప్రభుత్వం లెక్కల ప్రకారం తమిళనాడులో ఇప్పటివరకు కరోనాతో 2800 మంది మృతి చెందారు.ప్రభుత్వం అందించే సాయం వస్తుందని ప్రకటించారు.ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనాతో మృతి చెందినట్టు నిర్ధారణ అయిన కుటుంబాలకే ఈ పరిహారం అందుతుందని అన్నారు. ప్రభుత్వ పథకాలు పరిపాలనతో సీఎం స్టాలిన్ ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు.

తను తీసుకుంటున్న ప్రతి నిర్ణయం ప్రజల పక్షాన నిలబడేలా ఉంది.కరోనాతో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి ప్రభుత్వం ఈ సహాయం వారికి ఎంతోకొంత అండగా ఉంటుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube