సూపర్‌హిట్‌ సినిమా 'శ్రీదేవి సోడా సెంటర్' వరల్డ్ టెలివిజన్‌ ప్రీమియర్‌గా మీ జీ తెలుగులో

జీ తెలుగు తమ అభిమాన ప్రేక్షకుల కోసం రొమాంటిక్ యాక్షన్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సూపర్ హిట్ మూవీ ‘శ్రీదేవి సోడా సెంటర్‘ వరల్డ్‌ టెలివిజన్‌ ప్రీమియర్‌గా ప్రసారం చేయబోతోంది.ఈ సినిమా డిసెంబర్ 12, 2021 మధ్యాహ్నం 1:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ ఛానళ్లలో ఎక్స్‌క్లూజివ్‌గా ప్రసారమవుతుంది.

 The Super Hit Movie 'sridevi Soda Center' Is The World Television Premiere In  Z-TeluguStop.com

ప్రేమ కథల్లో ఉండే గమ్మత్తు ఏంటంటే… ఎన్ని విధాలుగా చెప్పినా, ఎంతమంది చెప్పినా ప్రేమ అనే రెండక్షరాల మధ్య భావోద్వేగాలు సినిమాను మళ్లీ మళ్లీ చూసేలా చేస్తాయి.ప్రేమ పుట్టడానికి నేపథ్యం ఏదైనా, పదే పదే చూపించిన కథే అయినా.

ఇంకోసారి చూసేట్టు కథ చెప్పడంలోనే నేర్పు దాగి వుంటుంది.దర్శకుడు కరుణ కుమార్ తొలి చిత్రంతోనే తన నేర్పుకి పదునుపెట్టి రెండో చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ అదే ఊపు చూపించారు.

గోదావరి జిల్లాల్లో సూరిబాబు(సుధీర్‌బాబు) పేరున్న ఎలక్ట్రీషియన్‌.చుట్టు ప‌క్కల ఏ వేడుక‌లైనా సూరిబాబు డీజే సెట్టే మోగుతుంది, సూరిబాబు లైటింగే మెరుస్తుంది.జాత‌ర‌లో సోడాల కొట్టు పెట్టిన ‘శ్రీదేవి సోడా సెంట‌ర్’ య‌జ‌మాని సంజీవరావు(న‌రేశ్‌) కూతురు శ్రీదేవిని(ఆనంది) చూసి మ‌న‌సు పారేసుకుంటాడు సూరిబాబు.ఆమె కూడా అత‌నితో ప్రేమలో పడుతుంది.

కానీ, ఇద్దరి ప్రేమ‌కి కులం అడ్డొస్తుంది.ఇదిలా ఉండగా ఊరి పెద్ద కాశీ (పావుల్‌ న‌వ‌గీత‌మ్) అనుచరుడితో గొడ‌వ వ‌ల్ల సూరి జైలుపాల‌వుతాడు.

సూరిబాబు శ్రీదేవిని మ‌ళ్లీ క‌లిశాడా లేదా? ఇద్దరి ప్రేమక‌థ సుఖాంత‌మైందా? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

రొమాంటిక్ యాక్షన్ డ్రామా ‘శ్రీదేవి సోడా సెంటర్’ సినిమా డిసెంబర్ 12, 2021 మధ్యాహ్నం 1:30 గంటలకు మీ జీ తెలుగు మరియు జీ తెలుగు హెచ్‌డీ చానళ్లలో.డోంట్‌ మిస్‌ ఇట్‌.

Telugu Anandhi, Naresh, Shdheerababu, Sridevi Soda, Tollywood, Premiere, Zee Tel

ఈ కార్యక్రమాన్ని ఎంజాయ్ చేయడానికి జీ తెలుగుని సబ్ స్క్రైబ్ చేసుకోండి.జీ తెలుగు ప్రైమ్ ప్యాక్ నెలకు 20 రూపాయలు మాత్రమే.

మీ అభిమాన జీ తెలుగు కార్యక్రమాల్ని మిస్ అవ్వకండి.

జీ తెలుగు, జీ సినిమాలతో పాటు జీ నెట్ వర్క్ కు చెందిన 7 టాప్ ఛానెల్స్ తో ఉన్న జీ ప్రైమ్ ప్యాక్ ను ఎంచుకోండి.నెలకు కేవలం 20 రూపాయలకు మీ కుటుంబమంతటికీ కావాల్సిన వినోదాన్ని అందించే ప్యాక్.మరిన్ని వివరాలకు మీ దగ్గర్లోని డీటీహెచ్ లేదా కేబుల్ ఆపరేటర్ ను సంప్రదించండి.

జీ తెలుగు గురించి

జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (ZEEL)కు చెందిన జనరల్ ఎంటర్ టైన్ మెంట్ ఛానెల్ జీ తెలుగు.2005 మే 18న ప్రారంభమైన జీ తెలుగు ఛానల్ తో సౌతిండియాలో ఎంటరైంది ఈ సంస్థ.దేశవ్యాప్తంగా ఉన్న 75 మిలియన్ తెలుగు ప్రేక్షకులకు ప్రతి వారం వివిధ రకాల వినోద కార్యక్రమాల్ని అందిస్తోంది జీ తెలుగు.

ఫిక్షన్ షోస్ నుంచి రియాలిటీ షోస్, టాక్ షోస్ వరకు వివిధ రకాల కార్యక్రమాలతో అల్టిమేట్ ఎంటర్టైన్ మెంట్ డెస్టినేషన్ గా అందరితో గుర్తింపు తెచ్చుకుంది.విలక్షణమైన స్టోరీలైన్స్ తో ఫిక్షన్ కార్యక్రమాలు, అదిరిపోయే నాన్-ఫిక్షన్ షోస్, అదిరిపోయే ఫార్మాట్స్ లో ఈవెంట్స్ తో పాటు అన్ని వర్గాల వారిని అలరించే టాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని దక్కించుకొని.

అద్భుతమైన కంటెంట్ ను అందిస్తోంది జీ తెలుగు.

సమతూకంగా ఉండే కంటెంట్ తో పాటు విభిన్నమైన కార్యక్రమాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో టాప్ జీఈసీ ఛానెల్ గా కొనసాగుతోంది జీ తెలుగు.

అన్ని కేబుల్ మరియు డిజిటల్ వేదికలపై జీ తెలుగు పూర్తిస్థాయిలో విస్తరించి ఉంది.ఇప్పుడు జీ5లో కూడా లభ్యమౌతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube