ఈ న్యాచుర‌ల్ సీరంను వాడితే ఆ జుట్టు స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్‌!

ఇటీవ‌ల రోజుల్లో స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా అంద‌రూ ఏదో ఒక జుట్టు సంబంధిత స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ ఉంటారు.ఈ క్ర‌మంలోనే జుట్టుకు ర‌క‌ర‌కాల హెయిర్ ఆయిల్స్‌, ఖ‌రీదైన షాంపూలు వాడుతుంటారు.

 How To Make Hair Serum At Home? Hair Serum, Hair, Hair Care, Hair Care Tips, Hai-TeluguStop.com

అయినా ఫ‌లితం లేకుండా ఏవేవో హెయిర్ ప్యాకుల‌ను వాడుతుంటారు.అయితే ఇప్పుడు చెప్ప‌బోయే న్యాచుర‌ల్ సీరంను వాడితే గ‌నుక జుట్టు సంబంధిత స‌మ‌స్య‌లెన్నిటినో నివారించుకోవ‌చ్చు.మ‌రి ఆ న్యాచుర‌ల్ సీర‌మ్ ఏంటీ.? దాన్ని ఎలా త‌యారు చేసుకోవాలి.? ఏ విధంగా వాడాలి.? వంటి విష‌యాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముందుగా అర క‌ప్పు క‌ల‌బంద ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి మెత్త‌గా పేస్ట్ చేసుకోవాలి.ఇప్పుడు ఈ క‌ల‌బంద పేస్ట్‌లో అర స్పూన్ విట‌మిన్ సి పౌడ‌ర్‌, మూడు విట‌మిన్ ఇ క్యాప్సుల్ ఆయిల్‌, ఒక స్పూన్ కొబ్బ‌రి నూనె వేసుకుని బాగా క‌లిసేలా మిక్స్ చేసుకుంటే సీర‌మ్ సిద్ధ‌మైన‌ట్టే.ఇక ఈ సీర‌మ్‌ను ఎలా వాడాలి అన్న‌ది చూసేద్దాం.

ముందుగా జుట్టుకు రెగ్యులర్​గా వాడే ఆయిల్‌ను ప‌ట్టించాలి.

ఆపై త‌యారు చేసుకున్న సీర‌మ్‌ను జుట్టు మొద‌ళ్ల నుంచి చివ‌ర్ల వ‌ర‌కు ప‌ట్టించి.ష‌వ‌ర్ క్యాప్ పెట్టేసుకోవాలి.

దాదాపు రెండు గంట‌ల అనంత‌రం కెమిక‌ల్ త‌క్కువ‌గా ఉండే షాంపూను యూజ్ చేసి త‌ల స్నానం చేయాలి.వారంలో రెండంటే రెండు సార్లు ఈ సీర‌మ్‌ను వాడితే గ‌నుక అదిరిపోయే బెనిఫిట్స్‌ను పొందొచ్చు.

ముఖ్యంగా ఈ న్యాచుర‌ల్ సీర‌మ్‌ కాలుష్యం, దుమ్ము, ధూళి, స్టైలింగ్ టూల్స్ వంటి వాటి నుంచి జుట్టును సంర‌క్షించి.హెయిర్ ఫాల్‌, హెయిర్ డ్యామేజ్‌, డ్రై హెయిర్ వంటి స‌మ‌స్య‌ల‌న్నీ ప‌రార్ అయ్యేలా చేస్తుంది.అలాగే ఈ సీర‌మ్‌ను వాడ‌టం వ‌ల్ల జుట్టు ఎల్ల‌ప్పుడూ స్మూత్‌గా, సాఫ్ట్‌గా, షైనీగా మెరిసి పోతుంటుంది.అదే స‌మ‌యంలో హెయిర్ గ్రోత్ కూడా ఇంప్రూవ్ అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube