ఇండియా, పాకిస్తాన్ బోర్డర్‌లో పుట్టిన శిశువు.. విచిత్రమైన పేరు పెట్టిన తల్లిదండ్రులు..

ఇండియా, పాకిస్తాన్.ఈ దాయాదుల దేశాల గురించి ప్రపంచం మొత్తానికి తెలుసు.

 Baby Born On India, Pakistan Border . Strangely Named Parents .. India, Pakistan-TeluguStop.com

ఇప్పటికీ క్రీడల్లో ముఖ్యంగా క్రికెట్‌లో ఈ రెండు దేశాలు తలపడితే ఇరు దేశాల ప్రజలు పనులు మానుకుని మరీ టీవీలకు అతుక్కుపోతారు.మరి ఇంత క్రేజ్ ఉన్న ఈ రెండు దేశాల బోర్డర్‌లో ఓ శిశువు పుడితే.

ఒక్క సారి ఆలోచించండి.నిజమే ఓ శిశువు జన్మించాడు కూడా.

ఇంత క్రేజ్ ఉన్న ప్లేస్‌లో అతనికి ఆ తల్లిదండ్రులు విచిత్రమైన పేరు పెట్టారు.ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టుగా చాలా మంది తల్లితండ్రులు తమ పిల్లలకు కొత్త కొత్త పేర్లు పెడుతుంటారు.

కొంత మంది ఇంగ్లీష్ పేరు పెడుతుండగా మరి కొందరి పేర్లు పలుకుదామంటే అసలు నోరు సైతం తిరగదు.ఇంకొందరైతే విచిత్రమైన పేర్లు పెడుతుంటారు.

ఈ కోవకు చెందిందే ఈ శిశువు పేరు కూడా.

అసలు ఏం జరిగిందంటే .పాకిస్తాన్‌ దేశానికి చెందిన దంపతులు 97 మంది ఆ దేశానికి చెందిన వారితో సుమారు 71 రోజులుగా అట్టారీ సరిహద్దు ప్రాంతంలో చిక్కుకున్నారు.వారిలో ఓ గర్భిణి సైతం ఉంది.

తాజాగా డిసెంబర్ 2వ తేదీన ఆమెకు మగబిడ్డ పుట్టాడు.ఆ శిశువు భారత్, పాక్ సరిహద్దు బోర్డర్‌లో పుట్టడంతో బోర్డర్ అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు.

ఇదే విషయాన్ని సదరు తండ్రి బాలం‌రామ్ వెల్లడించాడు.

Telugu Balaram, India, Pakistan, Pujab Pravince-Latest News - Telugu

తన భార్య నింబుబాయి ప్రసవ సమయంలో పంజాబ్ ప్రావిన్స్‌లోని రాజన్ పూర్ జిల్లాలో ఉన్నారు.ఆమెకు నొప్పులు రావడంతో ప్రసవం చేసేందుకు అక్కడి చుట్టు పక్కల మహిళలు వచ్చారని.వైద్య సదుపాయాలు కల్పించినట్టు చెప్పుకొచ్చాడు బాలం రామ్.

లాక్‌డౌన్‌కు ముందు బంధువులను కలవడానికి ఇండియాకు వచ్చిన ఆ దంపతులు తిరిగి వెళ్లేందుకు అవసరమైన పేపర్స్ లేకపోవడంతో ఇతర పాకిస్తాన్ పౌరులతో సహా.సరిహద్దు ప్రాంతంలో అట్టారి ఇంటర్ నేషనల్ చెక్ పోస్టు వద్ద చిక్కుకున్నట్టు తెలిపాడు బాలం రామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube