వాట్సాప్ లో 256 కాంటాక్ట్స్ కి ఒకేసారి ఎలా మెసేజ్ చేయాలో తెలుసా..?!

ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ అయిన వాట్సాప్ ఎప్పటికప్పుడూ యూజర్లను ఆకట్టుకునే దిశగా సరికొత్త ఫీచర్లను మనముందుకు తీసుకొస్తోంది.అయితే కొంతమందికి మాత్రం వాట్సాప్ లో ఉన్న అన్ని ఫీచర్ల గురించి తెలియదు.

 Send Whatsapp Messages To 256 Contacts At A Time Details, What's Up, Chats , Br-TeluguStop.com

అసలు వాట్సాప్ అందించే ఫీచర్లలో ఏయే ఫీచర్లు ఎలా పనిచేస్తాయో అనే విషయం తెలియకపోవచ్చు.అందుకే ఈరోజు మీకు వాట్సాప్ లో ఉన్న మరొక అద్భుతమైన ఫీచర్ ను మీకు తెలియచేయబోతున్నాము.

అది ఏంటంటే ఇప్పటిదాక వాట్సాప్ ద్వారా వీడియోలు, ఫొటోలు, వాయిస్ కాల్స్ ను కేవలం 5 గురికి మాత్రమే పంపే అవకాశం ఉంది.అంతకంటే ఎక్కువ మందికి పంపేందుకు ప్రయత్నిస్తే.

Forwarded Many Times అనే మెసేజ్ డిస్ ప్లే అవుతుంది కదా.ఐతే ఇలా ప్రతిసారీ ఐదు కాంటాక్టులను ఎంపిక చేసుకుని మెసేజ్ ఫార్వర్డ్ చేయాలంటే ఇబ్బందే అని చాలామంది గ్రూప్ లను క్రియేట్ చేసుకుంటున్నారు.

అయితే గ్రూప్ తో సంబంధం లేకుండా మెసేజ్ ను ఒకేసారి ఎక్కువ మందికి సెండ్ చేసే ఫీచర్ కూడా ఉంటే బాగుండు అని చాలా సార్లు మీరు అనుకునే ఉంటారు.అలాకాకుండా గ్రూపుతో సంబంధం లేకుండా గ్రూపు క్రియేట్ చేయకుండానే మీరు ఒకే మెసేజ్ ఏకకాలంలో 256 మందికి పంపే ట్రిక్ కూడా వాట్సాప్ లో అందుబాటులో ఉంది కానీ ఈ ట్రిక్ గురించి చాలామందికి తెలియకపోవచ్చు.మరి ఆ ట్రిక్ ఏంటో తెలుసుకుందామా!

Telugu Messages Time, Broadcast, Chats, Latest, Ups, Whats App, Whats, Whatsapp-

వాట్సాప్ లో ఉండే ఆ ఫీచర్ పేరు ఏంటంటే బ్రాడ్ కాస్ట్ లిస్ట్స్. ఈ ఫీచర్ ను ఉపయోగించి ఏదైనా ఒక మెసేజ్ ను ఒకేసారి 256 కాంటాక్టులకు పంపుకోవచ్చు.అయితే మీరు అలా మెసేజ్ ను పంపాలంటే ఆ యూజర్ యొక్క కాంటాక్టు తప్పనిసరిగా మీ ఫోన్ కాంటాక్టు లిస్టులో సేవ్ అయి ఉండాలి అని గుర్తు పెట్టుకోండి.

బ్రాడ్ కాస్ట్ లిస్ట్ ఫీచర్ ఎలా యూస్ చేయాలంటే ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ ఓపెన్ చేసి అందులో రైట్ టాప్ కార్నర్‌లో నిలువుగా ఉన్న త్రీ డాట్స్​ పై క్లిక్ చేయండి.

మీకు అక్కడ కొన్ని ఆప్షన్లు కూడా కనిపిస్తాయి.అందులో New Broadcast ఆప్షన్ మీద క్లిక్ చేసి బ్రాడ్​కాస్ట్​ ను సెలక్ట్ చేయగానే మీ ఫోన్లో సేవ్ చేసిన కాంటాక్ట్​ల లిస్టు మీకు కనిపిస్తుంది.

Telugu Messages Time, Broadcast, Chats, Latest, Ups, Whats App, Whats, Whatsapp-

అప్పుడు మీరు ఏయే యూజర్ల కాంటాక్టులకు పంపాలనుకుంటున్నారో ఎంపిక చేసుకోవాలి.గరిష్టంగా 256 కాంటాక్టుల వరకు మాత్రమే ఎంపిక చేసుకునే ఛాన్స్ ఉంది.అలా కాంటాక్ట్స్ ను సెలెక్ట్ చేసుకున్న తరువాత బ్రాడ్​ కాస్ట్ విండోను ఓపెన్ చేసి క్లిక్ చేయాలి అలాఈ బ్రాడ్ కాస్ట్ విండో సాయంతో ఎంచుకున్న వాట్సాప్​ కాంటాక్ట్‌లకు ఒకేసారి మీ మెసేజ్ ఫార్వర్డ్​ చేసుకోవచ్చు.ఒక్క మెసేజ్ మాత్రమే కాకుండా టెక్స్ట్, వాయిస్ మెసేజ్, ఫొటోలు, వీడియోలు ఇలా ఏవి అయినాసరే సింపుల్ గా క్షణాల వ్యవధిలో సెండ్ చేయవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube