రికార్డ్ రేటుకి అఖండ హిందీ డబ్బింగ్ రైట్స్..!

బాలయ్య అఖండ ఓ పక్క బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల బీభత్సం సృష్టిస్తుండగా మరోపక్క ఇతర బిజినెస్ లలో కూడా అదరగొడుతుంది.ఇప్పటికే డిజిటల్, శాటిలైట్ రైట్స్ భారీ రేటుకి అమ్ముడవగా లేటెస్ట్ గా సినిమా హిందీ డబ్బింగ్ రైట్స్ కూడా అదిరిపోయే రేటు పలికినట్టు తెలుస్తుంది.

 Balakrishna Akhanda Hindi Dubbing Rights Record, Balakrishna , Akhanda , Hindi-TeluguStop.com

ఫిల్మ్ నగర్ సర్కిల్స్ సమాచారం ప్రకారం బాలకృష్ణ అఖండ సినిమా హిందీ రైట్స్ 20 కోట్ల దాకా పలికినట్టు తెలుస్తుంది.బాలయ్య బాబు కెరియర్ లో హిందీ రైట్స్ ఈ రేంజ్ లో పలకడం కూడా ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.

బోయపాటి శ్రీను, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ మూవీగా అఖండ భారీ క్రేజ్ తెచ్చుకుంది.అంచనాలకు తగినట్టుగానే ఈ సినిమా వసూళ్లు సాధిస్తుంది.

సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్ నందమూరి ఫ్యాన్స్ కు పండుగ చేసుకునేలా చేసింది.ప్రగ్యా జైశ్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

సినిమా ఇప్పటికే సంచలన విజయం అందుకోగా అఖండ బాలయ్య కెరియర్ లో హయ్యెస్ట్ కలెక్టెడ్ సినిమాగా నిలుస్తుందని తెలుస్తుంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేని డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube