ఏపీ వరద బాధితులకు ప్రభాస్‌ కోటి విరాళం

యంగ్‌ రెబల్ స్టార్‌ ప్రభాస్ తన రాచ గుణంను చాటుకున్నాడు.దాన గుణంలో తాను సూపర్ స్టార్‌… నెంబర్ 1 అంటూ నిరూపించుకున్నారు.

 Prabhas Donated 1 Crore Towards Ap Cm Relief Fund For Flood Victims, Prabhas , C-TeluguStop.com

కరోనా వచ్చినా మరే ఆపద వచ్చినా జనాలకు తాను ఉన్నాను అంటూ సాయం చేసే వ్యక్తి ప్రభాస్.ఇండస్ట్రీలో అత్యధికంగా సాయం చేసే వ్యక్తి ప్రభాస్ అనడంలో సందేహం లేదు.

గత రెండు మూడు సంవత్సరాలుగా సందర్బం ఏదైనా కూడా తాను ఉన్నాను అంటూ ముందుకు వస్తున్న వ్యక్తి ప్రభాస్.ప్రతి ఒక్కరికి తన అవసరం ఉంది అనుకుంటే సాయం చేసేందుకు వెనుకంజ వేయడం లేదు.

ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్న ప్రభాస్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు.ఇతరులతో పోల్చితే భారీ సాయంను చేసి ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కించుకున్నాడు.

ప్రభాస్ తాజాగా ఏపీ వరద బాధితులకు గాను కోటి రూపాయల ఆర్థిక సాయంను అందిస్తున్నట్లుగా ప్రభుత్వంకు తెలియజేశాడు.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి కి ఈ మొత్తంను ఆయన అందించబోతున్నాడట.

ఏపీ సీఎం రిలీఫ్‌ ఫండ్ కు గాను ఈ మొత్తంను ఇస్తున్నట్లుగా తెలుస్తోంది.తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన పలువురు కూడా ఇప్పటికే వరద బాధితుల కోసం తమ వంతు సాయంను ప్రకటించారు.

హీరోల్లో అందరు కూడా 25 లక్షల రూపాయల చొప్పున సాయం చేస్తూ వచ్చారు.

Telugu Ap, Chiranjeevi, Flood Victims, Prabhas, Tollywood, Ys Jagan-Movie

సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇప్పటికే ఎన్టీఆర్‌.చిరంజీవి అల్లు అర్జున్‌.చరణ్‌ఇంకా పలువురు హీరోలు కూడా పాతిక లక్షల చొప్పున ఇవ్వడం జరిగింది.

ఇప్పుడు అదే జాబితాలో కోటి రూపాయల సాయం అందించి ప్రభాస్ కూడా చేరాడు.కాని అందరితో పోల్చితే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రభాస్ సాయం ను చేశాడు అంటూ అంతా అంటున్నారు.

ప్రభాస్ ఈ విషయాన్ని తనకు తాను బయటకు చెప్పలేదు.కాని 25 లక్షలు ఇచ్చిన హీరోలు మాత్రం గొప్పగా ప్రకటించారు.

ప్రభాస్ కోటి విరాళం గురించి మీడియా వర్గాల ద్వారా బయటకు వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube