క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబి నుంచి ఇలా బయటపడండి..!

క్రెడిట్ కార్డు ఉపయోగిస్తున్నప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.లేదంటే అప్పుల ఊబిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది.

 Credit Cards, Amount, Intrest, Latest News, Business Latest-TeluguStop.com

ముందుగా డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తే.

తరువాత ఇబ్బంది పడాల్సి వస్తుంది.అందుకే తిరిగి చెల్లించగల సామర్థ్యాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటున్నారు ఆర్థిక నిపుణులు.

ఇష్టారీతిన ఖర్చు చేస్తే ఆర్థిక సమస్యలు తప్పవంటున్నారు.అలాగే క్రెడిట్ స్కోర్ పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది అంటున్నారు.

భవిష్యత్తులో క్రెడిట్ తీసుకునే అవకాశాలు సన్నగిల్లుతాయని హెచ్చరిస్తున్నారు.ఒకవేళ మీరు ఇప్పటికే ఏ ప్లాన్ లేకుండా ఖర్చులు చేసి క్రెడిట్ కార్డ్ అప్పుల ఊబిలో కూరుకుపోయినట్లయితే దాని నుంచి బయటపడడానికి ఓ మార్గం ఉంది.

ఆ మార్గం ఏంటో ఇప్పుడు చూద్దాం.

చాలా క్రెడిట్ కార్డు కంపెనీలు పెండింగ్ బకాయిలను ఈఎంఐగా మార్చుకునే వెసులుబాటు కల్పిస్తున్నాయి.

మీ బాకీ ఎక్కువగా ఉన్నట్లయితే ఎక్కువ కాలం వరకు ఈఎమ్ఐ కట్టేలా మీరు ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది.ఈ సదుపాయం మంచిదే కానీ ఎక్కువ వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని మీరు మీ అప్పులను తీర్చడానికి ప్రణాళిక రచించుకోండి.అయితే తక్కువ కాల వ్యవధిలో మొత్తం అప్పును ఈఎంఐ ప్లాన్ ద్వారా తీర్చాలి అనుకుంటే తక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది.

అందుకే తక్కువ కాలవ్యవధిలో ఈఎంఐ కట్టేలా ప్లాన్ చేసుకోండి.

Telugu Amount, Latest, Credit Cards, Intrest-Latest News - Telugu

క్రెడిట్ కార్డు బకాయిలపై 40 శాతం వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.ఈ వడ్డీని తగ్గించుకోవడానికి ఓ మార్గం ఉంది.అదేంటంటే పర్సనల్ లోన్ తీసుకోవడం.

పర్సనల్ లోన్ తీసుకున్నప్పుడు వడ్డీ అనేది గరిష్టంగా కేవలం 11 శాతం గా మాత్రమే ఉంటుంది.అందువల్ల పర్సనల్ లోన్ తీసుకొని క్రెడిట్ కార్డ్ బకాయిలు చెల్లించడం ద్వారా అధిక వడ్డీ భారం నుంచి బయటపడవచ్చు.

సాధ్యమైనంతవరకు క్రెడిట్ కార్డు ద్వారా అత్యంత అవసరమైన వస్తువులను కొనుగోలు చేయాలే తప్ప అనవసరమైనవి కొనుగోలు చేయకూడదు.క్రెడిట్ కార్డు వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube