అక్కడ అలా చేస్తే పెట్రోల్ ఫ్రీగా ఇస్తారట... మన దేశం లోనే...

ప్రస్తుత కాలంలో వాహనాల వినియోగం ఎక్కువగా ఉండటంతో పెద్ద పెద్ద పట్టణాలలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఎదురవుతున్నాయి.దీనికితోడు కొంతమంది వాహనదారులకు ట్రాఫిక్ సిగ్నల్స్ గురించి సరైన అవగాహన లేకపోవడం మరియు ట్రాఫిక్ రూల్స్ ని పాటించకపోవడం వంటివి చేస్తుండడంతో రోజు రోజుకి ట్రాఫిక్ పోలీసులకు వాహనాల రద్దీని అరికట్టేందుకు సతమతమవుతున్నారు.

 100 Rupees Petrol Free In Gujarat State, 100 Rupees Petrol, Petrol Free, Free Pe-TeluguStop.com

దీంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు వినూత్న ఆలోచన చేసింది.

ఇందులో భాగంగా వాహనచోదకులు బయటికి వచ్చే సమయంలో కచ్చితంగా హెల్మెట్ ధరించి రావాలని అలాగే ట్రాఫిక్ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

అంతే కాక ప్రతి రోజు ట్రాఫిక్ రూల్స్ ని సక్రమంగా పాటిస్తూ వాహనం నడిపేటటువంటి వారికి 100 రూపాయలు విలువ చేసే పెట్రోల్ ఉచితంగా ఇస్తున్నట్లు పేర్కొంది.ఇందులో భాగంగా తరచూ ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద ఉన్నటువంటి సీక్రెట్ కెమెరాల ఆధారంగా వాహన చోదకులను పోలీసులు గమనిస్తూ ఉంటారని ఇందులో భాగంగా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించేవారిని గుర్తించి రోజుకి దాదాపు 50 మంది వ్యక్తులకి ఉచితంగా 100 రూపాయలు విలువ చేసే పెట్రోల్ కూపన్లను ఇస్తారని, ఈ కూపన్లను సంబంధిత పెట్రోల్ బంకులలో చూపిస్తే పెట్రోలు ఉచితంగా ఇస్తారని అధికారులు వెల్లడించారు.

ఇందులో భాగంగా ఈ పథకం మొదలు పెట్టిన రోజునే దాదాపుగా 50 మందికి పైగా వ్యక్తులను గుర్తించి ఉచిత పెట్రోల్ కూపన్లను అందజేశారు.

Telugu Rupees Petrol, Rupeespetrol, Petrol, Gujarat-Latest News - Telugu

దీంతో ఈ విషయంపై పోలీసులు స్పందిస్తూ రోజు రోజుకి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన పట్టణాలలోని కూడళ్ళ వద్ద ఏర్పడే ట్రాఫిక్ సమస్యలను అరికట్టేందుకు మరియు ట్రాఫిక్ రూల్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఈ వినూత్న ఆలోచనను చేపట్టినట్లు వెల్లడించారు.అలాగే ఈ ఉచిత పెట్రోల్ పథకాన్ని దాదాపుగా సంవత్సరకాలం పాటు కొనసాగిస్తున్నట్లు తెలుపుతూ ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.దీంతో ట్రాఫిక్ సమస్యను అధిగమించేందుకు పోలీసులు చేపట్టిన ఈ వినూత్న ఆలోచనపై స్పందిస్తూ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే రోజురోజుకీ పెరుగుతున్న పెట్రోల్ మరియు డీజిల్ ఇంధన ధరలను తగ్గించేందుకు కూడా కృషి చేయాలని ప్రభుత్వ అధికారులను కోరుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube