'అఖండ' విజయంతో ఆ దర్శకులు రిలాక్స్‌

బాలకృష్ణ.బోయపాటిల కాంబో లో రూపొందిన అఖండ సినిమా విడుదల అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Balakrishna Akhanda Movie After Movies , Akhanda , Anil Ravipudi , Balakrishna,-TeluguStop.com

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా భారీ ఎత్తున వసూళ్లు దక్కించుకుంది.యూఎస్ తో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా ఊహించని విధంగా విజయాన్ని నమోదు చేసిన నేపథ్యంలో బాలయ్య అభిమానులు ఫుల్‌ ఖుషీగా ఉన్నారు.

పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమాకు సంబంధించిన వసూళ్లు చూస్తుంటే అభిమానులు చాలా ఉత్సాహంగా ఉన్నారు.ఈ సినిమా విజయం అభిమానులకు మాత్రమే కాకుండా ఆ ఇద్దరు దర్శకులకు కూడా చాలా హ్యాపీగా ఉన్నట్లుగా తెలుస్తోంది.

బాలయ్య అఖండ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వం లో ఒక సినిమాను చేస్తున్నాడు.ఇప్పటికే ఆ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యింది.

ఆ సినిమా కూడా ఒక రియల్‌ ఫ్యాక్షన్ కథ అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Akhanda, Anil Ravipudi, Balakrishna-Movie

మరిన్ని విషయాలు తెలియాల్సి ఉంది.అఖండ విజయంతో గోపీచంద్ మలినేని సినిమా పై ఒత్తిడి కాస్త తక్కువ అవుతుంది.అంటే వరుసగా బాలయ్య ప్లాప్ లు దక్కించుకుంటే ఈ సినిమా తో అయినా సక్సెస్‌ కొట్టాలని అభిమానులు ఆశ పడుతూ ఉంటారు.

అఖండ తో ఆ విజయం వచ్చింది కనుక గోపీచంద్‌ రిలాక్స్.గోపీచంద్‌ మాత్రమే కాకుండా ఆ తర్వాత చేసే అనీల్ రావిపూడి కూడా చాలా రిలాక్స్‌ అవ్వొచ్చు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలకృష్ణ తో వీరిద్దరు చేయబోతున్న సినిమా లు రెండు కూడా 2022 లో ప్రేక్షకుల ముందుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.గోపీచంద్‌ మలినేని మూవీ సమ్మర్ లో రానుండగా అనీల్ రావిపూడి సినిమా వచ్చే ఏడాది దసరాకు రాబోతుంది.

దసరా కు వీలు పడకుంటే 2023 సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube