ఏపీకి తప్పిన భారీ ముప్పు.. ఊపిరిపీల్చుకున్న ప్రభుత్వ యంత్రాంగం..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొద్ది నెలల నుండి ప్రకృతి పగ పట్టినట్లు.పరిస్థితులు చోటుచేసుకున్నాయి.

 Jaweed Cyclone Not Effect To Andhra Pradesh , Jaweed Cyclone, Andhra Pradesh-TeluguStop.com

వరుసపెట్టి తుఫానులు వస్తూ ఉండటంతో.ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు రాయలసీమ అదే రీతిలో దక్షిణ కోస్తా లో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు.రాయలసీమలో ఎన్నడూ లేని విధంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో చాలామంది ఇల్లు కోల్పోయారు.

దీంతో ముఖ్యమంత్రి జగన్ వరద ప్రభావిత ప్రాంతాలలో.పర్యటించి ఇల్లు లేని వారికి ప్రభుత్వమే ఇల్లు కట్టిస్తుందని.

హామీ ఇచ్చారు.పరిస్థితి ఇలా ఉంటే ఒక పక్క జగన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న సమయంలో ఏపీకి మరో తుఫాను ముప్పు ఉందని వాతావరణ శాఖ తెలియజేయడం జరిగింది.

దీంతో వరద పర్యటన ముగించుకుని వెంటనే .తుఫాను ముప్పు ఎక్కువగా ఉండే ఉత్తరాంధ్ర అని వాతావరణ శాఖ తెలిపినట్లు అప్రమత్తం చేయడం జరిగింది.

జవాద్ అనే తుఫాన్ వల్ల ఉత్తరాంధ్ర మరియు కోస్తా ప్రాంతాల్లో కొన్ని జిల్లాలలో.భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రభుత్వ యంత్రాంగం ఉత్తరాంధ్రలో అదే రీతిలో కోస్తాలో అప్రమత్తమైంది.పరిస్థితి ఇలా ఉంటే తాజాగా జావాద్ తుఫాన్… తన దిశను మార్చుకుని ఇప్పుడు ఒడిశా వైపు వెళ్లినట్లు దీంతో ఉత్తరాంధ్రా కి.భారీ ముప్పు తప్పినట్లే.అది వాతావరణ శాఖ తెలపటంతో ప్రభుత్వ యంత్రాంగం.

ఊపిరి పీల్చుకుంది.ఉత్తరాంధ్ర తీరానికి సమీపించి బలహీన పడుతూ ఒరిస్సా వైపు వెళ్లడంతో.

పెద్ద ప్రమాదం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేయడం జరిగింది.ఇదిలా ఉంటే ప్రస్తుతం సిక్కోలు సాగర తీరం వెంబడి… ఈదురు గాలులు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి.

కాగా జవాధ్ తుఫాను ప్రభావం ఏమాత్రం ఉత్తరాంధ్ర వైపు లేదని వాతావరణ శాఖ తెలపటంతో ఉత్తరాంధ్ర వాసులు కూడా ఊపిరిపీల్చుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube