అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో చెప్పడం ఎవరి తరం కాదు.కానీ అది వచ్చిందంటే మాత్రం అప్పటి వరకు ఉన్న దరిద్రాలన్నీ కొట్టుకుపోతాయి.
కూటికి గతిలేని వారు కూడా కోటీశ్వరులు అయిపోతారు.అదృష్టం అంటే అదే మరి.కాగా ఈ అదృష్టాన్ని చాలా మంది నమ్మరు.కానీ ఇప్పుడు మేం చెప్పేది వింటే మాత్రం నిజంగా అదృష్టం అంటే ఇలాగే ఉంటుందేమో అనుకుంటారు.చాలామందికి లాటరీలో కోట్లు తగలడం మనం చూస్తున్నాం.దీన్నే ఒకింత అదృష్టం అనుకుంటారు.
ఎందుకంటే వారు కొన్న లాటరీలో ఏదో ఒకదానికి లక్ తగులుతుంది.
కానీ ఇప్పుడు మేం చెప్పబోయేది వింటే మాత్రం మిమ్మల్ని మీరే నమ్మలేరు.
ఎందుకంటే అతను కనీసం లాటరీ టికెట్ కూడా కొనకుండానే కోట్లు సొంతం చేసుకున్నాడు.మరి అతను ఎలా అంత సొమ్మును ఎలా దక్కించుకున్నాడో ఇప్పుడు చూద్దాం.
అమెరికా దేశానికి చెందిన మసాచుసెట్స్ లో నివసించే అలెగ్జాండర్ మెక్లీష్ ఎప్పటి నుంచో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు.కాగా అతను రీసెంట్ గా ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకుని ఇంట్లోనే ఉంటున్నాడు.
అయితే అతనికి అనుకోకుండా స్నేహితుడి దగ్గరనుంచి పార్సిల్ వచ్చింది.
ఏంటా అని చూడగా అందులో అందులో మూడు లాటరీ టికెట్లు ఉన్నాయి.వాటిని మెక్లీష్ హాస్పిటల్ లో ఉండగా అతని పేరు మీద మూడు లాటరీ స్క్రాచ్ ఆప్ టికెట్లను అనతి స్నేహితుడు కొనుగోలు చేసి అలాగే ఉంచాడు.అయితే మెక్లీష్ వాటిని స్క్రాచ్ చేయగా అందులో 1 మిలియన్ డాలర్ల లాటరీ ఒకటి రావడంతో తెగ ఆనందపడిపోయాడు.
దీని విలువ మన దేశంలో అయితే రూ.ఏడున్నర కోట్లు.ఒక్క దెబ్బతో అతను కోటీశ్వరుడు అయిపోయాడు.ఇంకేముంది అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయ్యాయి.ఈ వార్త కాస్తా నెట్టింట్లో ఇప్పుడు చెక్కర్లు కొడుతోంది.