పుష్ప ట్రైలర్ టీజ్.. శాంపిలే ఇలా ఉందంటే..!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ పుష్ప.మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.

 Allu Arjun Pushpa Trailer Tease Released, Pushpa Trailer Tease,allu Arjun, Pushp-TeluguStop.com

సినిమాలో సమంత స్పెషల్ సాంగ్ కూడా చేసిన విషయం తెలిసిందే.ఇక ఈ సినిమాలో పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ అదరగొట్టేశాడని తెలుస్తుంది.

ఇప్పటికే రిలీజైన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా లేటెస్ట్ గా ట్రైలర్ కు సంబందించిన టీజ్ ఒకటి రిలీజ్ చేశారు.అంటే ట్రైలర్ ఎలా ఉంటుంది అన్నది ఓ శాంపిల్ చూపించారన్నమాట.

స్టార్ట్ టు ఎండింగ్ ఆ కట్ షాట్స్ చూస్తుంటే పుష్ప బన్నీ స్టామినా ఏంటన్నది ఈసారి పాన్ ఇండియా రేంజ్ లో చూపించేలా ఉన్నాడు.ఈ సినిమా కూడా మాస్ ఆడియెన్స్ కు జాతర కలిగించేలా ఉంటుందని అనిపిస్తుంది.

మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఎక్సయిటింగ్ గా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప.ఇక ఈ సినిమా ట్రైలర్ డిసెంబర్ 6న రిలీజ్ ఫిక్స్ చేశారు.

డిసెంబర్ 17న పుష్ప పార్ట్ 1 రిలీజ్ ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.ఐకాన్ స్టార్ గా పుష్ప పాన్ ఇండియా రేంజ్ లో తన సత్తా చాటాలని ఫిక్స్ అయ్యాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube