ముగ్గురు హీరోలు 16 సినిమాలు. టాలీవుడ్ బీభత్సం

కరోనా తర్వాత టాలీవుడ్ లో మరింత స్పీడ్ కనిపిస్తుంది.ఏకంగా ఒక్కో హీరో మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు.

 Tollywood Heros Movies Latest News , Raviteja, Prabhas, Chirenjeevi , Acharya, K-TeluguStop.com

స్టార్ హీరోలంతా వరుసబెట్టి సినిమాలు చేస్తున్నారు.ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో రెండు మూడు కథలకు ఓకే చెప్తున్నారు.

చిరంజీవి, ప్రభాస్‌, రవితేజ చేతిలోనే ఏకంగా 16 సినిమాలున్నాయంటే వీరు ఏ స్పీడులో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

చిరంజీవి నటించిన ఆచార్య సినిమా పూర్తయ్యింది.ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కాబోతుంది.

తాజాగా గాడ్ ఫాదర్ అనే సినిమాకు కొబ్బరికాయ కొట్టారు.అటు భోళా శంకర్ సినిమా పనులు మొదలయ్యాయి .తాజాగా బాబీ సినిమాకు క్లాప్ కొట్టారు.తాజాగా మారుతి ఓ కథ చెప్పాడట.

ఈ సినిమాకు కూడా తను ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.అటు త్రివిక్రమ్ సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం అందుతోంది.

Telugu Salaar, Acharya, Chirenjeevi, Dhamaka, Khiladi, Prabhas, Rama Rao Duty, R

అటు రవితేజ కూడా మంచి స్పీడులో ఉన్నాడు.ఆయన తాజా సినిమా ఖిలాడీ రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమా తర్వాత ధమాకా, టైగర్‌ నాగేశ్వరరావు, రావణాసుర, రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాలు వరుసబెట్టి చేస్తున్నాడు.ఈ సినిమాలు అయిపోక ముందే మరికొన్ని సినిమా కథలు వింటున్నట్లు తెలుస్తోంది.

క్రాక్ సినిమాతో యావరేజ్ హిట్ కొట్టిన ఆయన ప్రస్తుతం మంచి స్పీడులో ఉన్నాడు.ఇక ప్రభాస్ పాన్ ఇండియన్ రేంజిలో ముందుకు సాగుతున్నాడు.

ప్రస్తుతం ఆయన నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతికి రిలీజ్ కాబోతుంది.ఆ తర్వాత సలార్ రిలీజ్ కానుంది.

అటు ఆదిపురుష్ కూడా రెడీ అవుతోంది.ఈ సినిమాలు అలా ఉండగానే నాగ్ అశ్విన్ తో ఓ సినిమాకు రెడీ అవుతున్నాడు.

అటు సందీప్ వంగాతో కలిసి స్పిరిట్ అనే సినిమా చేస్తున్నాడు.అటు బాలీవుడ్ నుంచి కూడా ఆయనకు పలు అవకాశాలు వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube