ప్రభాస్ తర్వాత చిరంజీవి మాత్రమే.. వీరి జోరు ఇండస్ట్రీకి బూస్ట్‌

ఇండస్ట్రీలో 1980 మరియు 1990 ల్లో స్టార్‌ హీరోలు ఒకే సారి నాలుగు అయిదు సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి.నెలలో రెండు మూడు సినిమాలను విడుదల చేశారు.

 Chiranjeevi Back To Back Movies Shooting Like Prabhas , Chirenjeevi, Flim News,-TeluguStop.com

కాని ఇప్పుడు ఏడాదికి కనీసం ఒకటి రెండు సినిమాలు కూడా గగనం అయ్యాయి.ఇప్పుడు సినిమాల మేకింగ్ ఖరీదు చాలా పెరిగింది.

పెద్ద ఎత్తున బడ్జెట్‌ ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కాస్త ఎక్కువ సమయం తీసుకుంటున్నారు.రాజమౌళి మరియు శంకర్ వంటి దర్శకులు ఏకంగా ఏళ్లకు ఏళ్లు సినిమాకు టైమ్ తీసుకుంటున్నారు.

రాజమౌళి బాహుబలి మరియు బాహుబలి 2 ఇంకా ఆర్ఆర్ఆర్‌ సినిమా లకు ఏకంగా పదేళ్ల సమయం తీసుకున్నాడు.హీరోలు కూడా సినిమాల మేకింగ్‌ విషయంలో సమయం ఎక్కువ కేటాయిస్తున్నారు.

దాంతో సినిమాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది.కాని రాబోయే రోజుల్లో మళ్లీ హీరోలు ఏడాదికి రెండు మూడు అంతకు మించిన సినిమాలను విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్ తో పాటు ఇండస్ట్రీలోని పలువురు స్టార్స్ వరుసగా సినిమాలను చేస్తున్నారు.ఇప్పటికే అక్షయ్‌ కుమార్‌ భారీ సినిమాలను సునాయాసంగా ఏడాదికి మూడు నాలుగు విడుదల చేస్తున్నాడు.

Telugu Chiranjeevi, Prabhas, Ram Charan-Movie

అలాంటి పరిస్థితి తెలుగు లో రాబోతున్నట్లుగా అనిపిస్తుంది.ప్రభాస్ ఇప్పటికే రాధే శ్యామ్‌ సినిమా తో సిద్దంగా ఉన్నాడు.ఆ సినిమా కాకుండా ఆదిపురుష్‌, సలార్‌, ప్రాజెక్ట్‌ కే, స్పిరిట్‌ సినిమాలు ముందు ఉన్నాయి.ఈ సినిమాల్లో ఆదిపురుష్‌ షూటింగ్‌ పూర్తి అవ్వగా సలార్ సగం పూర్తి అయ్యింది ప్రాజెక్ట్‌ కే షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది.

మెగాస్టార్ చిరంజీవి కూడా ఆచార్య ను ముగించి విడుదలకు సిద్దం చేశాడు.ఇక లూసీఫర్ రీమేక్ గాడ్‌ ఫాదర్‌ ను ఇప్పటికే సగానికి పైగా పూర్తి చేశారు.

వేదాళం రీమేక్ భోళా శంకర్ సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది.ఇక బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న వాల్తేరు వెంకన్న సినిమా కూడా షూటింగ్ ప్రారంభం అయ్యింది.

ఒకటి షూటింగ్‌ పూర్తి మూడు సినిమాలు ఆన్‌ లొకేషన్.ఇన్ని సినిమాలు ప్రభాస్‌ మరియు చిరంజీవిలు మాత్రమే ఒకేసారి చేస్తున్నారు.

ఇది ఖచ్చితంగా ముందు ముందు అందరు హీరోలు ఫాలో అవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube