కృత్రిమ చేతిని పొందిన చిన్నారి ఆనందానికి నెటిజ‌న్లు ఫిదా..

కొన్ని ఘ‌ట‌న‌లు ఆనందాన్ని క‌లుగ జేస్తాయి.మ‌రికొన్ని ఘ‌ట‌న‌లు ఆవేశాన్ని తెప్పిస్తాయి.

 Netizens Are Happy For The Child Who Got The Artificial Hand Details, Artificial-TeluguStop.com

ఆయా సంద‌ర్భాల‌ను బ‌ట్టి ఆయా ఎమోష‌న్ లు ఆటోమేటిక్ గా వ‌చ్చేస్తాయి.ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట షేర్ చేయ‌గానే అందుకు ఎలాంటి ఎమోష‌న్ ను చూపించాలో నెటిజ‌న్ల‌కు బాగా తెలుసు.

నిజానికి ఎలాంటి వారినైనా విమ‌ర్శించే ప్లాట్ ఫామ్ ఒక్క సోష‌ల్ మీడియానే  కావ‌చ్చు.ఎందుకంటే ఎవ‌రినీ నేరుగా విమ‌ర్శించ‌లేని వారు కూడా ఇక్క‌డ మాత్రం త‌ప్పు జ‌రిగితే ఖచ్చితంగా విమ‌ర్శిస్తారు.

అదే స‌మ‌యంలో కొన్ని ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌శంసిస్తారు కూడా.

ఇంకొన్ని ఘ‌ట‌న‌లు మాత్రం ప్ర‌తి ఒక్క‌రినీ భావోద్వేగానికి గురి చేస్తాయి.

ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటిదే.సాధార‌ణంగా చేతులు లేని వారు ప‌డే బాధ‌లు అన్నీ ఇన్నీ కావు.

అలాంటి బాధ‌ను అనుభ‌విస్తున్న వారికి ఒక్క‌సారిగా ఆ బాధ దూర‌మ‌య్యేలా చేస్తే మాత్రం ఆ క్ష‌ణాలు వారి జీవితంలో చాలా అద్భుత‌మైన‌విగా ఉండిపోతాయి.ఇప్పుడు వైర‌ల్ అవుతున్న వీడియోలో ఓ బాబు ప‌రిస్థితి కూడా ఇదే.అత‌నికి పుట్టుక‌తోనే ఓ చేయిలేదు.ఈ వీడియోలో అత‌ను వీల్ చేర్‌లో కూర్చోవ‌డం మ‌న‌కు క‌నిపిస్తుంది.

అయితే ఓ డాక్ట‌ర్ వ‌చ్చి అత‌నికి కృత్రిమ చేతిని అమ‌ర్చ‌డం కూడా ఇందులో చూడొచ్చు.

కాగా ఆ కృత్రిమ చేతిని ఇలా అమ‌ర్చ‌గానే ఆ పిల్లాడు ఎంతో ఆనందిస్తాడు.ప్రొస్తెటిక్ చేతిని ఇలా డాక్ట‌ర్ సెట్ చేయ‌గానే దాన్ని మ‌రో చేతితో తాకి ఎంతో ఆనందిస్తాడు ఆ చిన్నారి.స్వ‌చ్చ‌మైన మ‌న‌సుతో ఆ బుడ్డోడు న‌వ్వ‌డం అంద‌రినీ క‌ట్టిప‌డేస్తోంది.

స్వ‌చ్ఛమైన మ‌న‌సుతో ఎలాంటి క‌ల్మ‌షం లేకుండా ఆనంద‌ప‌డ‌టం అందరినీ భావోద్వేగానికి గురి చేస్తోంది.దీన్నంతా కూడా కొంద‌రు వీడియో తీయ‌గా.

దాన్ని నెటిజ‌న్లు తెగ షేర్ చేస్తున్నారు.చిన్నారి జీవితం హాయిగా సాగిపోవాలంటూ కోరుకుంటున్నారు చాలామంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube