పీకే డైరెక్షన్ లో ' కారు ' సారు '  ? ఆ ఫోకస్ కోసమే ...,? 

టీఆర్ఎస్ అధినేత కేసిఆర్ మంచి రాజకీయ నాయకుడే కాదు,  మంచి రాజకీయ వ్యూహకర్త.సమయానుకూలంగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ, రాజకీయాన్ని రక్తి కట్టించగలడు.

 Politically These Are The Reasons Behind Prashant Kishore Taking Kcr-advice Pras-TeluguStop.com

ఆ తెలివైన రాజకీయ వ్యూహాల  కారణం గానే టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీ అధికారంలోకి తీసుకురావడం,  తెలంగాణ సాధించడం, రెండోసారి అధికారాన్ని సంపాదించడం ఇలా  చాలా అంశాలే కేసిఆర్  సక్సెస్ ఫుల్ వ్యూహాలకు నిదర్శనం.ఇక మూడో సారి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావాలనే దృఢనిశ్చయంతో కేసీఆర్ ఉన్నారు .అయితే గతంతో పోలిస్తే పరిస్థితులు ఇప్పుడు అనుకూలంగా లేకపోవడం,  టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఎదుర్కోవడం, వరుసగా ఎదురవుతున్న ఓటమిలు ఇవన్నీ ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి.అందుకే గెలుపుపై ఈసారి కేసీఆర్ కు నమ్మకం లేకుండా పోయింది.

దీనికి తోడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని      కేసిఆర్ చూస్తూ ఉండడం తోనే  రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ద్వారా తన ఎత్తుగడ ను అమలు చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ఈ మేరకు ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తోనూ కేసిఆర్ భేటీ అయినట్లు వార్తలు వచ్చాయి.

అలాగే ప్రగతి భవన్ లోనూ ప్రశాంత్ కిషోర్ కు చెందిన ఐ ప్యాక్ టీమ్ తోనూ కేసిఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం.ఈ సందర్భంగా ఐ ప్యాక్ టీమ్ సభ్యులు తెలంగాణ రాజకీయాల్లో టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా నడుచుకోవాలి,  ప్రసంగాలు ,  ఏ విధంగా ప్రజల్లోకి  వెళ్లాలనే విషయంపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక తెలంగాణ వ్యాప్తంగా ప్రజాభిప్రాయం తెలుసుకునేందుకు సర్వే నిర్వహించి నివేదిక ఇచ్చేందుకు ఐ ప్యాక్ టీం సిద్ధమవుతోంది.అయితే అసలు ప్రశాంత్ కిషోర్ రాజకీయ వ్యూహాలు టిఆర్ఎస్ కు అవసరమా అనే చర్చ కూడా జరుగుతోంది.

రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకు రావడంతో పాటు తెలంగాణ సాధించే వరకు పోరు వదిలిపెట్టకుండా  అనుకున్నది సాధించిన ఘనమైన చరిత్ర కేసీఆర్ కు ఉంది .అయినా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ద్వారా ముందుకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించుకోవడానికి కారణాలు చాలా ఉన్నాయట.

Telugu Congress, Pack, Jagan, Strategy, Pragathi Bhavan, Telangana Cm, Trs-Telug

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్  చక్రం తిప్పాలని నిర్ణయించుకున్నారు.  తెలంగాణతోపాటు  , జాతీయ రాజకీయాల్లో కీలకం కావాలని చూస్తున్నాడు .దానికోసం తన ఒక్కడి బలం సరిపోదని భావించి , ప్రశాంత్ కిషోర్ సేవలను కేసీఆర్ ఉపయోగించుకునేందుకు సిద్ధమయ్యారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇక దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ లకు వ్యతిరేకంగా ప్రత్యేక కూటమి అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రశాంత్ కిషోర్ స్థానిక , ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు.

  ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ , కేసీఆర్, జగన్, స్టాలిన్, ఇలా చాలామంది  కలిపి ఒక కూటమి గా ఏర్పడేలా ప్రశాంత్ కిషోర్ చేస్తున్నారు.ఇప్పుడు కేసీఆర్ పికే సలహాలు తీసుకోవడం వెనుక కారణాలు ఇవే అని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube