అక్కడ సాలిడ్ ప్రమోషన్స్ ను రెడీ చేస్తున్న పుష్పరాజ్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా గ్లామర్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా పుష్ప.భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాని మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి తెరకెక్కిస్తున్నారు.

 Allu Arjun Pushpa Movie Promotions In Bollywood, Allu Arjun, Bunny, Pushpa, Push-TeluguStop.com

ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

రిలీజ్ డేట్ దగ్గర పడడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో వేగం పెంచేశారు.

వారానికి ఒక అప్డేట్ ఇస్తూ ఈ సినిమాను జనాలకు మరింత చేరువ చేస్తూ మరిన్ని అంచనాలను పెంచేస్తున్నారు.ఇక రిలీజ్ కు 15 రోజులు మాత్రమే ఉండడంతో సాలిడ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

పాన్ ఇండియా స్టార్ గా అల్లు అర్జున్ మొదటిసారి ఎంట్రీ ఇస్తుండడంతో ప్రమోషన్స్ కూడా అదే స్థాయిలో చేయడానికి మేకర్స్ అంత సిద్ధం అయ్యారు.

అందుకే నార్త్ లో ఈ సినిమాను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి బ్యాక్ గ్రౌండ్ పనులు స్టార్ట్ చేశారట.

హిందీ మార్కెట్ లో అల్లు అర్జున్ మొదటి సినిమా కావడంతో ఈ సినిమాను వీలైనంత ఎక్కువుగా ప్రోమోట్ చేస్తూ నార్త్ ప్రేక్షకులను ఈ సినిమా కోసం రెడీ చేస్తున్నారు.అక్కడ ఆల్రెడీ భారీ ప్రమోషన్స్ ప్లాన్స్ సిద్ధం చేయగా హిందీ వెర్షన్ టీజర్ ని థియేట్రికల్ గా చూపించడం ఇప్పటికే స్టార్ట్ చేశారట.

Telugu Allu Arjun, Alluarjun, Bollywood, Bunny, Pushpa, Sukumar-Movie

ఇక అల్లు అర్జున్ కు స్మాల్ స్క్రీన్ మీద అక్కడి స్టార్ హీరోలతో సమానంగా ఆదరణ ఉంది.ఇక ఇప్పుడు థియేటర్స్ దగ్గర భారీ స్క్రీన్ మీద అల్లు అర్జున్ సినిమాకు ఏ విధంగా రెస్పాన్స్ వస్తుందా అని ఐకాన్ స్టార్ అభిమానులంతా వేయి కళ్ళు చేసుకుని ఎదురు చూస్తున్నారు.ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించడమే కాకుండా ప్రమోషన్స్ కు కూడా భారీ ఖర్చు చేయడానికి వెనకాడడం లేదు.మరి చూడాలి బన్నీకి హిందీ ప్రేక్షకులు ఏ విధంగా వెల్కమ్ చెబుతారో.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube