అర్థాంతరంగా ఈ ప్రపంచాన్ని వీడి విషాదాన్ని నింపిన నటీమణులు వీళ్లే?

సినిమా ఇండస్ట్రీలో నటీమణులు స్టార్ స్టేటస్ ను అందుకోవడం తేలిక కాదనే విషయం తెలిసిందే.కాలం ఎవరి జీవితంలో ఎలాంటి మార్పులు చేస్తుందో ఎవరూ చెప్పలేరు.

 Shocking And Mysterious Deaths Cine Actress Interesting Facts  Details, Mysterio-TeluguStop.com

అర్ధాంతరంగా ఈ లోకాన్ని వీడి అభిమానులను బాధ పెట్టిన నటీమణులు చాలామందే ఉన్నారు.తెలుగుతో పాటు ఇతర భాషల్లో స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్న శ్రీదేవి 2018 సంవత్సరంలో దుబాయ్ లోని ఒక హోటల్ లో మరణించారు.

కార్డియాక్ అరెస్ట్ వల్ల శ్రీదేవి చనిపోగా ఆమె మరణం వల్ల అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా తనకంటూ మంచి గుర్తింపును సొంతం చేసుకున్న కుల్జీత్ రాంధావా వేర్వేరు కారణాల వల్ల జీవితాన్ని ముగిస్తున్నానని సూసైడ్ నోట్ రాసి చనిపోయారు.

ప్రముఖ నటి సిల్క్ స్మిత హీరోయిన్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చి మేకప్ ఆర్టిస్ట్ గా తన కెరీర్ ను మొదలుపెట్టారు.

ఆ తర్వాత స్పెషల్ సాంగ్స్ చేయడం ద్వారా సిల్క్ స్మిత పాపులారిటీని సంపాదించుకున్నారు.

కేవలం 36 సంవత్సరాల వయస్సులోనే సిల్క్ స్మిత చనిపోయారు.

Telugu Aarti Agarwal, Bhargavi, Heroiens, Divya Bharathi, Jiya Khan, Silk Smitha

తెలుగుతో పాటు ఇతర భాషల్లో గుర్తింపును సొంతం చేసుకున్న ఫటాఫట్ జయలక్ష్మి మరణం మిస్టరీగా మిగిలింది.వరుస ఆఫర్లతో తెలుగులో గుర్తింపు తెచ్చుకున్న ప్రత్యూష 20 సంవత్సరాల వయస్సులోనే చనిపోయారు.

Telugu Aarti Agarwal, Bhargavi, Heroiens, Divya Bharathi, Jiya Khan, Silk Smitha

అందం, అభినయం ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న సౌందర్య మరణం తెలుగు సినీ అభిమానులలో విషాదాన్ని మిగిల్చింది.హెలికాఫ్టర్ ప్రమాదంలో ఈ నటి మృతి చెందారు.అష్టాచమ్మా సినిమాలో నటనతో మెప్పించిన భార్గవి మరణం కూడా మిస్టరీగా మిగిలింది.

హీరోయిన్ ఆర్తి అగర్వాల్ బరువు తగ్గడానికి చేయించుకున్న ఆపరేషన్ వికటించడంతో ప్రాణాలు కోల్పోయారు.నటి దివ్య భారతి, జియాఖాన్ కూడా చిన్న వయస్సులోనే మరణించారు.

ఈ నటీమణులలో చాలామంది అనుమానాస్పద స్థితిలో మరణించడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube