ఆరు నెల‌లుగా వైసీపీలోకి త‌గ్గిన వ‌ల‌స‌లు.. కార‌ణం అదేన‌ట‌..

సాధార‌ణంగా మ‌న రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంప్ర‌దాయం ఉంటుంది.అదేంటంటే అధికారంలో ఉన్న‌ పార్టీలోకి ప్ర‌తిప‌క్షాల నుంచి భారీగా వ‌ల‌స‌లు వెళ్తుంటారు నేత‌లు, కార్య‌క‌ర్త‌లు.

 Immigrants Who Have Been Reduced To Ycp For Six Months  The Reason Is The Same .-TeluguStop.com

ఇలా ఎప్ప‌టి నుంచో జ‌రుగుతూనే ఉంది.అప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తిప‌క్షంలో ఉన్న పార్టీ ఎన్నిక‌ల్లో గెలిచి అధికారంలోకి రాగానే మిగ‌తా పార్టీల నుంచి ఆ పార్టీలోకి వ‌ల‌స‌లు క్ర‌మేణా పెరుగుతుంటాయి.

ఇదే విష‌యం ఏపీలో ఉన్న టీడీపీ, వైసీపీల‌కు కూడా బాగానే వ‌ర్తిస్తోంది.టీడీపీ గెలిచిన‌ప్పుడు వైసీపీ నుంచి భారీగా వ‌ల‌స‌లు వెళ్లాయి.

చాలా మంది ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు.

ఇక 2019ఎన్నిక‌ల్లో వైసీపీ గెల‌వ‌డంతో చాలామంది టీడీపీ నేత‌లు వైసీపీ బాట ప‌ట్టారు.

ఇలా దాదాపు రెండేండ్లుగా వైసీపీలోకి వ‌ల‌స‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి.అయితే ఏమైందో ఏమో గానీ గ‌త ఆరు నెల‌లుగా వైసీపీలోకి వ‌ల‌సలు ఆగిపోయాయి.

వ‌రుస ఎన్నిక‌ల్లోనూ గెలుస్తూ వ‌చ్చిన వైసీపీలోకి గ్రౌండ్ లెవ‌ల్ కార్య‌క‌ర్త‌లు కూడా రావ‌ట్లేదు.ఇదే అంద‌రికీ షాక్ ఇస్తోంది.

గ్రామస్థాయిలో ఉన్న ఇత‌ర పార్టీల నేత‌లు కూడా వైసీపీలోకి వెళ్ల‌క‌పోవ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం.ఇందుకు కొన్ని కార‌ణాలు కూడా ఉన్న‌యండోయ్‌.

Telugu Ap Potics, Chandra Babu, Tdp Candiadtes, Ys Jagan-Telugu Political News

అదేంటంటే వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత అన్ని ప‌నులు వారే చూసుకుంటున్నారు.ప్ర‌జ‌లు ఏ అవ‌స‌రానికైనా స‌రే వారి వ‌ద్ద‌కే వెళ్తున్నారు.ప్ర‌జాప్రతినిధుల ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌డం మానేశారు.ఇక పింఛ‌న్లు, ఇత‌ర సంక్షేమ ప‌థ‌కాల‌న్నీ కూడా ఆన్ లైన్ ద్వారానే అమ‌ల‌వుతున్నాయి.దీంతో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు కూడా ఎలాంటి ప‌ని ఉండ‌ట్లేదు.ప్ర‌జ‌ల్లోకి వెళ్లేందుకు వారికే ఏమీ లేదు.

ఇక తాము వెళ్లి ఏం చేస్తామంటూ తెలుగు త‌మ్ముళ్లు ఆగిపోతున్నార‌ని స‌మాచారం.పైగా టీడీపీ, జ‌న‌సేన కేడ‌ర్ చాలా ఉత్సాహంగా ఉంది.

ఏ మాత్రం నిరుత్సాహంలో లేక‌పోవ‌డంతో వైసీపీలోకి ఎవ‌రూ వెళ్ళట్లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube