వరద బాధితులకు వరాల జల్లు ప్రకటించిన సీఎం జగన్..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన వర్షాలకు భారీ ఎత్తున నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.ముఖ్యంగా కడప చిత్తూరు నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు భవనాలు కూలిపోయాయి.

 Cm Jagan Announces No Interest For Women Loans For Flood Victims, Kadapa, Ys Jag-TeluguStop.com

పంట పొలాలు నీట మునిగాయి.ఇటువంటి తరుణంలో ఈరోజు సీఎం జగన్ వరద ప్రాంతాల్లో పర్యటన చేపట్టారు.

ముందుగా కడప జిల్లాలో పర్యటిస్తూ .నేరుగా వరద బాధితులతో ముఖాముఖిగా మాట్లాడారు.వారి కష్టాలను తెలుసుకుని.కచ్చితంగా ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.ఇటువంటి తరుణంలో కడప రాజంపేట లో పర్యటించిన సమయంలో.వరద బాధితులకు వరాల జల్లు ప్రకటించారు.

విషయంలోకి వెళితే వరదల కారణంగా.ఇంటిని పోగొట్టుకున్న వారికి మూడు లేక ఐదు సెంట్లలో.ఇంటి నిర్మిస్తామని హామీ ఇచ్చారు.వరద మృతుల కుటుంబాల్లో ఒకరికి.

అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పిస్తామని స్పష్టం చేశారు.అదేవిధంగా పొదుపు మహిళల రుణాలపై ఏడాది పాటు వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు.

పొలాలలో పేరుకుపోయిన వేసుకుని స్థానికులు ఎడ్ల బండితో తోలు కోవచ్చని.అన్నారు.

అదేవిధంగా డ్యామేజ్ జరిగిన రిజర్వాయర్ల ప్రాజెక్టులు మళ్లీ డిజైన్ చేసి పటిష్టంగా కడతామని.కడప జిల్లా వరద బాధితులతో నేరుగా ముఖాముఖిగా మాట్లాడిన సమయంలో సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

జగన్ ఇచ్చిన మాట తో వరద బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube