ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు డెడ్ లైన్..!!

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం రోజురోజుకూ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న గాని ఫలితాలు శూన్యం అన్న తరహాలో పరిస్థితి ఉంది.

 Supreme Court Dead Line To Delhi Government, Supreme Court, Delhi,delhi Air Poll-TeluguStop.com

ఈ క్రమంలో ఢిల్లీ కాలుష్యం పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.ఢిల్లీ ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టడం జరిగింది.

విషయంలోకి వెళ్తే 24 గంటల్లోగా పారిశ్రామిక, వాహనాల ఉద్గారాల.నియంత్రణకు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.

ఏదైనా అంటే టాస్క్ఫోర్సు చర్యలు చెబుతున్నారు గాని క్షేత్రస్థాయిలో.కాలుష్యం ఏమాత్రం నియంత్రణలోకి రాలేదని అసహనం వ్యక్తంచేసింది కోర్టు.

ఉన్న కొద్ది కాలుష్యం పెరుగుతుందని.దీన్ని బట్టి చూస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అర్థం అవుతున్నట్లు న్యాయస్థానం చెప్పుకొచ్చింది.

కాలుష్యం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పెద్దలు వర్క్ ఫ్రొం హోమ్ చేస్తుంటే.పిల్లలను స్కూల్ కి ఎలా పంపుతారు అని ఢిల్లీ ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది.

అసలు కాలుష్యం ఎక్కువగా ఉంటే విద్యాసంస్థలు ఎందుకు తెరిచారు అని నిలదీసింది.ఈ క్రమంలో ఢిల్లీలో కాలుష్యానికి సంబంధించి ప్రతిరోజు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం ఆదేశాలు ఇవ్వడం జరిగింది.

దీంతో సుప్రీం ఆదేశాల మేరకు విద్యాసంస్థలు మూసివేస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube